* మునుగోడులో వ్యాపారం చేస్తున్న లింగస్వామి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడు కామినేని ఆసుపత్రికి తరలించిన పోలీసులునల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి (32)కి మునుగోడులో కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్ వ్యాపారం ఉంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. గత రాత్రి దుకాణం మూసేసి బ్రాహ్మణవెల్లంలలోని తన ఇంటికి బయలుదేరాడు. సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి లింగస్వామిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో లింగస్వామి కుప్పకూలిపోయాడు.చనిపోయి ఉంటాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఓ వ్యక్తి కాల్పుల శబ్దం విని అక్కడికొచ్చాడు. రక్తపు మడుగులో పడివున్న లింగస్వామిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారకస్థితిలో ఉన్న లింగస్వామిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు.
* కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో 8వ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చి ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. ఇటీవల కడుపులో నొప్పిగా ఉందని చెప్పింది. దీంతో బంధువులు ఆమెను ప్రభుత్వ వెల్లూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక ఆగస్ట్ 2న మగ బిడ్డను ప్రసవించింది. దీంతో వైద్యాధికారులు ఈ విషయాన్ని పిల్లల సంక్షేమ కమిటీకి తెలుపగా, వారు వెల్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* థాయ్‌ల్యాండ్ చోన్బురి ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నైట్‌క్లబ్‌లో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో పలువురు దుర్మరణం పాలయ్యారు. అర్ధరాత్రి దాటాక సట్టాహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటిదాకా 13 మంది దుర్మరణం పాలైనట్లు అధికారులు ధృవీకరించారు. మరో 35 మంది తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బాధితులంతా థాయ్ పౌరులేనని పోలీసులు వెల్లడించారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు.
* ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో శిక్షణ పొందుతున్న 32 ఏళ్ల యువకుడు శుక్రవారంనాడు తన హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉరివేసుకుని కనిపించడంతో ఇది ఆత్మహత్య కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో ఎలాంటి సూసైట్ నోట్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.
* ములుగు జిల్లాలో యువకులపై బోల్తా పడ్డ లారీ…లారీ కిందచిక్కుకున్న ముగ్గురు యువకులు..ఇద్దరిని కాపాడిన గ్రామస్థులు, లారీ కిందే చిక్కుకున్న మరి బాలున్ని కాపాడేందుకు ప్రయత్నాలు..మంగపేట మండలం చుంచుపల్లి మూల మలుపు వద్ద ఘటన-కర్ర లోడ్ ఖమ్మం వైపు వెళ్తున్న లారీ..-అదుపుతప్పి బోల్తా..
-రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులపై బోల్తా..-లారీ డ్రైవర్ క్షేమం, ప్రాణాపాయ స్థితిలో ముగ్గురు
* వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సింహాద్రిపురం మండలం ఇనుకుంటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం ఇనుకుంట గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి.. పులివెందులలోని కడప రోడ్డులో ఉన్న భారతీయ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఇవాళ తెల్లవారుజామున స్థానికులు గమనించగా.. ఇంటి ఆవరణలోనే రక్తపు మడుగులో విగత జీవిగా పడిఉన్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఆదినారాయణ రెడ్డి అవివాహితుడు. అతనికి నాలుగు ఎకరాల పొలం, ఓ ఇల్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఆస్తి కోసంఎవరైనా హత్య చేసి ఉంటారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం పక్కన కారంపొడి ఉండటం, తల, శరీరంపై గాయాలు ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్లో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. వాంబే కాలనీ లోని ఏ బ్లాక్‌లో నివాసం ఉంటున్న కొండయ్య(65),పైడమ్మ(60)లు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. తెల్లవారినా తలుపులు తెరవకపోవటంతో.. అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు కిటికీలోంచి తొంగిచూడగా ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దంపతుల మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులకు సర్జికల్ స్పిరిట్, తక్కువ ధర రకం మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దానివల్ల ఏమైనా చనిపోయి ఉంటారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
* కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కక్ష పెట్టుకున్న కోడలు.. ఆమెను కిరాతకంగా హత్య చేసింది. ఆపై దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టు మార్టం రిపోర్టు అసలు విషయాన్ని బహిర్గతం చేయడంతో కోడలు జైలు పాలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ పెడన పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరులకు వెల్లడించారు.
* జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఓ టెంపో ట్రాలీ లోయలో పడిన ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. రాంబన్ జిల్లాలో జమ్మూ నుంచి బనీహాల్ కు టెంపో ట్రాలీలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ లోయలో పడింది. లోయలో పడే ముందు టెంపో ఓ కారును ఢీకొందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిలవడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బెళుగప్ప మండలం కాల్వపల్లి వద్ద ఇద్దరు మహిళలపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. అయితే ప్రమాదం అనంతరం లారీ ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో స్థానికులు దానిని వెంబడిం బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య పట్టుకుని డ్రైవర్‌కు దేహశుద్ధిచేశారు.
* థాయ్‌లాండ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణాన 150 దూరంలో ఉన్న సట్టహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్‌స్పాట్ నైట్‌క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్ మొత్తానికి మంటలు విస్తరించడంతో 13 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడుగంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే నైట్‌క్లబ్ మొత్తం కాలిపోయింది.
*హుస్నాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ క్రేన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ మినీ బస్సు హుస్నాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద భారీ క్రేన్‌ను బస్సు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయడ్డారు.
*అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఘోరంగా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. పెన్నా నది వంతెన పై నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మిదేవి(46), సరస్వతి(45)గా అనే మహిళలపైకి లారీ దూసుకెళ్లడంతో ఇద్దరి అక్కడికక్కడే మృతిచెందారు. శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైయ్యాయి. పేరూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెన్నా నదిలోకి వరద నీరు వచ్చింది. ఆ దృశ్యాలను చూడటానికి మహిళలు వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన లారీని గ్రామస్థులు వెంబడించి… బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య పట్టుకున్నారు. ప్రమాదంపై పోలీసులు సరిగా పట్టించుకోలేదంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
*థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తూర్పు థాయ్‌లోని చోన్బురి ప్రావిన్స్‌లోని సత్తాహిప్ జిల్లా సమీపంలో గల మౌంటెన్ బి నైట్ క్లబ్లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో విదేశీయులు లేరని స్థానిక మీడియా తెలిపింది.
*కర్ణాటక యాదగిరి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మరణించారు. కారు, లారీ ఢీకొనడం వల్ల చనిపోయిన వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.రాయ్‌చూర్ జిల్లా లింగసుగుర్ మండలం హట్టి గ్రామానికి చెందిన మహ్మద్ మఝర్ హుసేన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ వచ్చారు. కొడంగల్ సమీపంలోని ఓ దర్గాను దర్శించుకుని గురువారం రాత్రి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గురమిత్కల్ మండలం అరెకేరా వద్ద వారి కారును.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. 6 నెలల చిన్నారితో పాటు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడ్ని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
*జలపాతం వద్ద ఫొటో దిగుతూ ఒకరు గల్లంతైన ఘటన తమిళనాడు దిండిగుల్లో జరిగింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బిహార్‌లో జరిగిన మరో ఘటనలో బోల్తా పడిన రైలు బోగీ వద్ద ఫొటో దిగుతున్న ఇద్దరు యువకులకు హైటెన్షన్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
*హుజురాబాద్‌లో బీజేపీ (BJP) నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. జమ్మికుంట, హుజురాబాద్‌లో అరెస్టులు కొనసాగుతున్నాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి (Krishna Reddy)ని అరెస్ట్ చేశారు.
*బాపట్ల (Bapatla) మండలం, కంకటపాలెంలో ప్రేమ వ్యవహారం (Love affair) దాడికి దారి తీసింది. కంకటపాలెం గ్రామానికి చెందిన ఆనంద్, దివ్యల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య కుటుంబ సభ్యులు ఆనంద్ ఇంటిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*శ్రీశైలం మండలం సున్నిపెంట ఆర్టీసి బస్టాండ్‌లో ఓ వ్యక్తిపైకి రాజమండ్రి ఆర్టీసీ డిపో బస్సు దూసుకుపోయింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తలపైకి బస్సు టైర్ ఎక్కడంతో మృతుని తల నుజ్జు నుజ్జు అయింది. మృతుడు సున్నిపెంటకు చెందిన పరిసెపోగు ఏసు (45)గా గుర్తించారు. సమాచారం అందుకున్న శ్రీశైలం టూటౌన్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
*భర్త సోదరునితో పెట్టుకున్న వివాహేతర సంబంధానికి దూరమవ్వడం ఇష్టంలేని ఓ మహిళ.. ప్రియునితో కలిసి చావుకు సిద్ధమైంది. రెండేళ్ల వయస్సున్న తన కన్నకూతురిని ముందుగా కడతేర్చి.. ఆపై, మరిదితో కలిసి ఉరి వేసుకుని బలవన్మరణం పొందింది. వివాహేత సంబంధానికి మూడు ప్రాణాలు బలైన ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సిమ్రూద్ హయ్యర్ గ్రామానికి చెందిన గజేంద్ర కుసుబ.. పటాన్చెరు మండలంలోని ఓ ప్రైవేటు సంస్థలో కార్మికునిగా పని చేస్తున్నారు. భార్య రేఖ(28) కూతురు సోనమ్(2)తో కలిసి బానూరులో నివాసముంటున్నారు. అయితే, గజేంద్ర సోదరుడు బసుదేవ కుసుబ(27) బానూరులోని సోదరుని ఇంటి పక్కనే నివాసముంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనికి చేరాడు. స్వగ్రామంలో ఉన్నప్పుడే బసుదేవ, రేఖ మధ్య వివాహేతర సంబంధం ఉండగా, విషయం పెద్ద మనుషులు దాకా వెళ్లింది. అనంతరం బసుదేవ నందిగామ వచ్చిన తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించారు. బుధవారం రాత్రి బసుదేవ, రేఖ(రేఖ ఇంట్లో) కలిసి ఉండగా గజేంద్ర వారిని చూశాడు. అనంతరం ఏం జరిగిందో తెలియదు కానీ కూతురు సోనమ్‌కు చీరతో ఉరి వేసిన రేఖ, ఆపై బసుదేవతో కలిసి అదే చీరకు ఉరి వేసుకుని కనిపించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, గజేంద్ర పక్క గదిలో ఉండగానే ఈ దారుణం జరిగింది.
* విజయవాడ నగర శివారులోని వాంబే కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. వాంబేకాలనీలో రెండో బ్లాక్‌లో నివాసముంటున్న కొండయ్య, మైసమ్మ అనే దంపతులు రెండురోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారి ఇంటి కిటికీల నుంచి చూడగా విగతజీవులుగా ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దంపతుల మృతిపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.