ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామానికి చెందిన గుడిదేవి వీరభద్రయ్య-పావని దంపతుల కుమార్తె సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం ఆద్యంతం రమణీయంగా సాగింది.
ఆగస్టు 13వ తేదీన సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమం సాయి తేజస్వి సోదరి ఖ్యాతిశ్రీ గణపతి ప్రార్థనతో ప్రారంభమయింది. విష్ణు ఆవాహనంతో నృత్యప్రదర్శన ప్రారంభమై, వర్ణం, పదం, అభంగ్, జావళి, థిల్లాన నాట్య అంశాలతో కనులవిందుగా సాగింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో మూడు గంటలపాటు ప్రేక్షకులను అలరించింది. గురువు శ్రీలిజీ శ్రీధరన్ ఈ నృత్యాలకు రూపకల్పన చేశారు.
పద్మశ్రీ గ్రహీత, కూచిపూడి నాట్యాచారిణి పద్మజా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సాయితేజస్విని అభినందించారు. ప్రత్యేక అతిధులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి వెంకట్ పద్మనాధన్, కళాక్షేత్ర గురువర్యులు సీతారాజన్, విదూషి డా.ఎమ్.ఎస్. శ్రీలక్ష్మి, సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, సామాజిక కార్యకర్త సునీత రెడ్డిలు హాజరయ్యారు.
సింగపూరులో భరతనాట్య రంగప్రవేశం చేసిన ఒంగోలు ప్రవాసాంధ్రురాలు

Related tags :