NRI-NRT

కాణిపాకంలో వైభవంగా మూడోరోజు మహాకుంభాభిషేక పూజలు

కాణిపాకంలో వైభవంగా మూడోరోజు మహాకుంభాభిషేక పూజలు

కాణిపాకంలో నిర్వహిస్తున్న చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం కార్యక్రమంలో మూడో రోజైన బుధవారం కలశ ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కలశాన్ని ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామి ఆలయం నుంచి మాడ వీధులలో ప్రదక్షణగా వరసిద్ధుడి ఆలయానికి తీసుకొచ్చారు. యాగశాలలో పూజలలో కొలువుదీర్చారు. ఆలయ యాగశాలలో ఉదయం 7 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం, కలశారాధన, లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గణపతిపూజ, పుణ్యాహవచనం, అనుజ్ఞ, ప్రవేశబలి, రక్షోఘ్నహోమం, వాస్తు శాంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఈఈ వెంకటనారాయణ, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకారవి, గుత్తికొండశ్రీనివాస్‌, వారికుటుంబ సభ్యులు, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీనివాస్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.
2022 Kanipakam Maha Kumbhabhishekam Third Day Puja
2022 Kanipakam Maha Kumbhabhishekam Third Day Puja