DailyDose

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి.. భారతీయులందరూ ఎంతో భక్తి శ్రద్దలతో కృష్ణుడి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వి రేసులో ఉన్న రిషి సునాక్‌ పాల్గొన్నారు. పండుగ నేప‌థ్యంలో ఆయ‌న త‌న భార్య అక్ష‌తతో క‌లిసి భ‌క్తివేదాంత మ‌నోర్‌ ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు సోషల్‌ మీడియాలో వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన వారి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ కృష్ణుడి పుట్టిన‌రోజును జ‌న్మాష్ట‌మి పేరుతో వేడుక‌లు నిర్వ‌హిస్తారు. పండుగ సంద‌ర్భంగా తన భార్య అక్షితతో కలిసి తాను గుడికి వెళ్లిన‌ట్లు రిషి తెలిపారు.ఇదిలా ఉండగా.. బ్రిటన్‌ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్‌ ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. కాగా, బ్రిటన్‌ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రూస్, రిషి సునాక్‌ మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. ప్ర‌స్తుత స‌ర్వేల ప్రకారం.. రిషి సునాక్ మళ్లీ లీడింగ్‌లోకి వచ్చిన‌ట్లు తెలుస్తోంది.
https://twitter.com/ani_digital/status/1560466833043378176/photo/1