Sports

సైనా అంత స్టామినా లేక…

Parineethi chopra sweating hard for sainas biopic

బ్యాడ్మింటన్‌ చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ కథానాయిక పరిణీతి చోప్రా. క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో సైనా పాత్రకు శ్రద్ధా కపూర్‌ సంతకం చేశారు. ఆమె చాలా రోజులు పాత్ర కోసం కష్టపడ్డారు. సైనా దగ్గర బ్యాడ్మింటన్‌ నేర్చుకున్నారు. సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఆమె పాత్రను పరిణీతి పోషించబోతున్నారు.