సినీ నటి నమిత టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘సొంతం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నమిత అనతి కాలంలోనే అగ్ర కథానాయకులతో జోడీ కట్టి ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె కవలలకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నమిత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్లు తెలిపింది. కృష్ణాష్టమి రోజున ఈ గుడ్‌న్యూస్ పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. ఇప్పుడు తామంతా అరోగ్యంగా ఉన్నామని, అభిమానుల ఆశీస్సులు తమకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కవలలను ఎత్తుకొని భర్తతో ఉన్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.