NRI-NRT

ముగ్గురు మిత్రుల ఆత్మీయ ఆలోచన

ముగ్గురు మిత్రుల ఆత్మీయ ఆలోచన

*వైభవంగా ‘తానా‘ ఆధ్వర్యంలో పంచెలు , ఓణీల కార్యక్రమం
సేవ అంటే అండగా ఉండటం కాదు .. ఆసర అవ్వడం కాదు .. అనాధుల అభాగ్యుల జీవితంలో ఆత్మీయులుగా మమేకమవ్వడం అని ఆ ముగ్గురు మిత్రులు నిరూపించారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు అందే సంతోషాలను అనాధలకు అందాలని మనసున్న ఆలోచన చేశారు ఆ తీపి జ్ఞాపకాల్లో ఆ చిన్నారులు మేం అనాధలం కాదు .. మాకు ఎవరూ లేరన్న బాధ మరిచిపోవాలని ఆకాంక్షించారు. పుట్టిన రోజు, ఆ తరువాతి జరిగే ప్రతి కార్యక్రమం తమ పిల్లలకు వైభవంగా జరపాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అదే తల్లిదండ్రి లేని వారికి అటువంటి చిన్నపాటి సంతోషాలకు దూరమై నైరాశ్యంలో ఉంటారు. బట్టలు, అన్నమో ఇస్తారు గాని ఇటువంటి జరపడానికి ఎవరూ ముందుకు రారు. కానీ వారి జీవితాల్లో ఆత్మీయులుగా మెలిగి అన్ని సంతోషాలను అందించాలని కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. వారే శశికాంత్ వల్లేపల్లి , ఉప్పుటూరి రామ్ చౌదరి, వెంకట్ జల్లెలమూడి ప్రవాస భారతీయులుగా తానా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఈ ముగ్గురు మనకు సుపరిచితులే.. వారికి వచ్చిన ఆలోచనే అనాధలకు మేనమాములుగా మారి ఓణీలు, పంచె ల కార్యక్రమాన్ని జరపాలి అనుకోవడం … అనుకున్నదే తడువుగా గుంటూ రు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర, మాజీ జడ్పీటీసీ ఉప్పుటూరి సీతామహాలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో 20 మంది అనాధలకు ( 10 మంది బాలికలు , 10 మంది బాలు రు ) కు పంచెలు , ఓణీల కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల ఆధ్వ ర్యంలో శాస్త్రోకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వస్త్రాలతో పాటు సంప్ర దాయంగా అందించే బంగారు, వెండి వస్తువులను అనాధలకు అందించారు. తమ జీవితంలో ఇటువంటి కార్యక్రమం జరగడంపై చిన్నారులు సంతో షం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం కానీ చిన్నారుల జీవితంలో ఆత్మీయులుగా మారి ఇటువంటి కార్యక్రమం చేయ డం సంతోషంగా ఉందని వారు తెలిపారు. సేవా కార్యక్రమాలు నామమా త్రంగా ఉండకూడదని ఆత్మీయతను కూడా పంచాలని వారు కోరారు.
ముగ్గురు మిత్రుల ఆత్మీయ ఆలోచన
IMG-20220821-WA0121
IMG-20220821-WA0122
IMG-20220821-WA0123
instagram album downloader
IMG-20220821-WA0130