అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర కోరారు. శుక్రవారం వాషింగ్టన్ డీసీలోని అమరావతి ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులతో ఆయన సమావేశం అయ్యారు. వచ్చే 12వ తేదీతో అమరావతి ఉద్యమానికి 1000 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా అమెరికాలో కూడా అమరావతి సంఘీభావ పాదయాత్ర నిర్వహించాలని తీర్మానించారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి మాటతప్పి ప్రజలను మోసం చేశారని ధూళిపాళ్ల దుయ్యబట్టారు. మన్నవ సుబ్బారావు, భాను మాగులూరి, మన్నవ వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ ఆచంట, చనుమోలు అనిల్ కుమార్, ధూళిపాళ్ల వీరనారాయణ, కోట రామ్మోహన్, కిషోర్ కంచర్ల, ముప్పనేని జగన్మోహన్ రావు, అజయ్ గోవాడ తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలో అమరావతి సంఘీభావ యాత్ర. డీసీలో ధూళిపాళ్ల.
Related tags :