Politics

నిజామబాద్ నుండి జాతీయ రాజకీయ ప్రస్థానం:కేసీఆర్

KCR Says His National Political Journey Starts From Nizamabad

‘‘1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఎంతో నష్టపోయాం. స్వాతంత్య్రానికి ముందే హైదరాబాద్‌ సంస్థానంలో ఎంతో అభివృద్ధి కనిపించేది. 60 ఏళ్లు పోరాటం చేసి మళ్లీ తెలంగాణను సాధించుకున్నాం. ఇవాళ దేశం మొత్తం ఆశ్యర్యపోయే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలుకావడం లేదన్నారు. రైతులకు ఉచితంగా నిరంతర విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. 2024లో దేశం భాజపా ముక్త్‌ భారత్‌ కావాలి. దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభం కావాలి. బావి దగ్గర మీటర్లు పెట్టమనే సర్కారును సాగనంపాలి. రూ.1.20 లక్షల కోట్లు ఖర్చయ్యే ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దని మోదీ చెప్తున్నారు. 8ఏళ్లలో మోదీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమగానీ నిర్మించిందా? దేశంలో ఉన్నవాటినే అమ్ముకుంటూ పోతున్నారు. ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూలదోయడమే మోదీ చేస్తున్న ఏకైక పని. దేశ రాజకీయాల్లోకి రావాలని జాతీయస్థాయి రైతు నాయకులు నన్ను అడిగారు. తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం. కాలువల్లో నీరు పారాలో? మతపిచ్చితో రక్తం పారాలో? ప్రజలు ఆలోచించుకోవాలి. నిజామాబాద్‌ గడ్డ నుంచే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తా’’ అని కేసీఆర్‌ అన్నారు.