ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి 2022 లోకనాయక్ పురస్కారాన్ని అందజేశారు. సోమవారం సాయంకాలం విశాఖలో జరిగిన లోకనాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్.టీ.ఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్.టి.ఆర్‌పై లఘుచిత్ర ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమయింది. పురస్కారాన్ని అందుకున్నవారిలో గోలేటి రామచంద్రరావు, మోహన్, కృష్ణారావు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, సినీనటుడు మోహన్‌బాబు, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ తదితరులు పాల్గొని ఎన్.టి.ఆర్‌తో తమ అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.
తనికెళ్ల భరణికి లోకనాయక్ పురస్కార ప్రదానం
Related tags :