శిశువులకు యాంటీబయాటిక్ ఔషధాలను ఎక్కువగా ఇస్తే.. పెద్దయ్యాక వారిలో పేగుల సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు అధికంగా ఉంటుందని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. తక్కువ బరువుతో, నెలలు నిండక ముందే జన్మించే పిల్లల్లో ఇన్‌ఫెక్షన్ల నివారణ/చికిత్స కోసం వైద్యులు యాంటీబయాటిక్ మందులను ఇస్తుంటారు. చాలా చిన్న వయసులోనే ఆ ఔషధాల ప్రభావానికి గురవుతుండటంతో.. పెద్దయ్యాక వారి పేగుల్లో మేలుదాయక సూక్ష్మజీవులు నశిస్తున్నాయని, ఆహార కదలికలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని పరిశోధకులు నిర్ధారించారు. డయేరియా వంటి లక్షణాలు ఎక్కువగా తలెత్తుతున్నాయనీ గుర్తించారు.
చిన్నారులకు యాంటిబయాటిక్స్…పెరిగాక పెనుప్రమాదాలు
Related tags :