ప్రపంచ ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని వెనక్కినెట్టి రెండవ స్థానంలో నిలిచారు.
◻️ ప్రస్తుతం ఆయన 154.7 బిలియన్ డాలర్ల సంపదతో బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది.
◻️92 బిలియన్ డాలర్ల సంపదతో ముకేష్ అంబానీ ఎనిమిదో స్థానానికి పడిపోయారు.
◻️273.5 బిలియన్ డాలర్ల సంపదతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటిస్థానంలో నిలిచినట్లు తెలిపింది.
◻️ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫ్రెంచ్ వ్యాపార వేత్త బెర్నార్డ్ అర్నాల్ట్‌ను కూడా వెనక్కినెట్టారు.
◻️గత నెల కూడా అదానీ ఆర్నాల్ట్‌ను అధిగమించినప్పటికీ, మస్క్, బెజోస్‌ల తరువాత మూడో స్థానంలో నిలిచారు.