మేడిన్ ఇండియా విస్కీలపై మోజు పెరుగుతోంది. 2018లో గ్లోబల్‌గా అమ్ముడుపోయిన ప్రతి ఐదు విస్కీ కేస్లలో మూడు మనవే ఉన్నాయని ఇంటర్నేషనల్ వైన్ అండ్ స్పిరిట్స్ రీసెర్చ్(ఐడబ్ల్యూఎస్ఆర్) వెల్లడించింది. అంతేకాక ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతోన్న విస్కీ బ్రాండ్‌గా ఆఫీసర్స్ ఛాయిస్ నిలుస్తున్నట్టు తెలిపింది. గ్లోబల్‌గా ఆఫీసర్స్ ఛాయిస్‌కు చెందిన 3.4 కోట్ల కేస్లు అమ్ముడుపోయినట్టు పేర్కొంది. జాతీయ రహదారులపై మద్యం విక్రయాలు సాగకుండా తాత్కాలికంగా నిషేధం విధించడం వల్ల విస్కీ సేల్స్ కాస్త తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ సేల్స్ మళ్లీ పుంజుకున్నట్టు రిపోర్ట్లు తెలిపాయి. అంతేకాక గత నాలుగేళ్లలో అత్యధికంగా 11 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు కూడా ఇంటర్నేషనల్ వైన్ అండ్ స్పిరిట్స్ రీసెర్చ్(ఐడబ్ల్యూఎస్ఆర్) తెలిపింది.2014–2018 మధ్య కాలంలో ఇండియన్ విస్కీ సేల్స్ 50 శాతానికి పైగా పెరిగాయి. గ్లోబల్ లిక్కర్ మార్కెట్ గ్రోత్ రేటుతో పోలిస్తే మూడు రెట్లు అధికం. అన్ని బ్రాండ్స్ కూడా వార్షికంగా 10 లక్షలకు పైగా కేస్‌లను విక్రయించినట్టు ఐడ్ల్యూఎస్ఆర్ తెలిపింది. గ్లోబల్‌గా విస్కీ, వోడ్కా, గిన్, రమ్ వంటి కేటగిరీల్లో ప్రతి ఐదు స్పిరిట్స్‌లో ఒకటి మేడిన్ ఇండియా బ్రాండే ఉన్నట్టు పేర్కొంది. ఏబీడీ, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, పెర్నాడ్ రికార్డ్‌లకు చెందిన బ్రాండ్స్ మొత్తం ఇండియన్ విస్కీ సెగ్మెంట్లో 90 శాతం ఆక్రమించాయి. మొత్తం విక్రయాల్లో ఏబీడీ ఆఫీసర్స్ ఛాయిస్వే 90 శాతం ఉన్నాయి.స్టెర్లింగ్ రిజర్వ్ రేంజ్ ప్రీమియం విస్కీలపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలిపింది.2018లో ఇవి 12 లక్షల కేస్లు అమ్ముడుపోయినట్టు తాజా రిపోర్ట్ పేర్కొంది. ఓ వైపు జాతీయ రహదారులపై మద్యం విక్రయాలు సాగించవద్దని తాత్కాలికంగా నిషేధం కొనసాగిన సమయంలో కూడా ప్రీమియం బ్రాండ్స్ ఎలాంటి తగ్గుదలను నమోదు చేయలేదు. ప్రతేడాది 2 కోట్ల మంది ప్రజలు లీగల్ డ్రింకింగ్ ఏజ్‌లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ఎంట్రీ లెవల్ బ్రాండ్స్ కూడా విక్రయాలను పెంచుకుంటున్నాయి.
విస్కీ మేడిన్ ఇండియాకు మాంచి క్రేజ్
Related tags :