Politics

NTR వైద్య విశ్వవిద్యాలయ పేరు మార్పు

YS Jagan To Change NTRHU To YSRHU

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బుధవారం సవరణ బిల్లును శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1998 జనవరి 8న ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా విశ్వవిద్యాలయ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. 2006 జనవరి 8న అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది.