సిడ్నీలో వేడుకగా బతుకమ్మ,దసరా ఉత్సవాలు ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF)మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయ
ది పాండ్స్ పాఠశాల ఆడిటోరియంలో నిర్వయించిన బతుకమ్మ 2000 మందికి పైగా తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటా…పాటతో, సిడ్నీ నగరం పులకించింది..!! ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో మార్మోగాయి.
బతుకమ్మ అచ్చతెలుగు మాట, తెలంగాణ ప్రజల సాంప్రదాయం శతాబ్ధాల సంస్క్రుతి తంగేడు పూల సాహిత్యమాల ఆడబడచుల ఆత్మీయ ఆటల కేళి, కొత్త జీవన స్ఫూర్తిని నింపే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు గొప్ప ఊరట. ఇటువంటి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మను సిడ్నీ నగరంలో ప్రవాస తెలంగాణవాసులు కన్నుల పండుగగా జరుపుకున్నారు. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆడపడుచులు సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు, రంగు రంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో సందడి చేశారు. తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేశారు. వాటిని తయారు చేసిన మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు.
ఈ వేడుకల్లో కోలాటం, ప్రత్యేక దాండియా షో, జమ్మి పూజ, శివ గర్జన డ్రమ్స్, బతుకమ్మ స్పెషల్ లేజర్ షో, స్పెషల్ ఫోక్ బ్యాండ్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరు
సిడ్నీ బతుకమ్మ దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF) బతుకమ్మ చైర్మన్ – అనిల్ మునగాల వందన సమర్పణ చేస్తూ,ఈ బతుకమ్మ వేడుకలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను , ఆచార వ్యవహారాలను పాటిస్తుండటం ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పడమే సంస్థ ముఖ్య ఉదేశ్యంని, ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావటానికి కోశాధికారి- శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్, ప్రజా అధికారి – డేవిడ్ రాజు, కార్య నిర్వాహక కమిటీ సబ్యులు – కవిత టూటుకూరు, కావ్య గుమ్మడవల్లి, వాణి ఏలేట్, శ్వేత యమ, శ్వేత తెడ్ల, హారిక మన్నెం, వత్సల ముద్దం, విద్యా సేరి, లత కడపర్తి చేసిన కృషి కారణమన్నా తెలిపారు.
సిడ్నీ బతుకమ్మ ఇంత విజయవంతం కావటానికి కారణమైన – స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలంటీర్స్ కు – — కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలియచేసారు