దిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎన్జీటీ సంయుక్త కమిటీ విధించిన పరిహారం వెంటనే జమచేయాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పులో అన్ని అంశాలు యథాతథంగా అమలు చేయాలంది. ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించిన కారణంగా ప్రభుత్వానికి ₹250 కోట్ల జరిమానా విధిస్తూ ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. అయితే, దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.