Politics

విజయవాడలో 50 కోట్ల భూమి కబ్జాకు వైకాపా నేతల కుట్ర

విజయవాడలో 50 కోట్ల భూమి కబ్జాకు వైకాపా నేతల కుట్ర

ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ మద్దతు తో దేవుడు భూమిని వేలం పాట లో అమ్మటానికి రెఢీ అయ్యారు!

విజయవాడ రామలింగేశ్వర నగర్ లో రెచ్చిపోతున్న కబ్జా దారులు. దేవుని భూమి విలువ ₹50 కోట్లు పైబడే. కంచె చేను మేస్తే కాపు ఏమి చేయగలడు అన్న రీతిలో విజయవాడ లో దేవాలయ భూముల పై కన్నేశారు అధికార పార్టీకి చెందిన నాయకులు దేవాలయ అధికారుల అండ దండలతో. దేవదాయ శాఖ లోని క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఇప్పటికే వాటాలు పంచుకున్నారు. అన్ని విషయాలు తెలిసిన గానీ పట్టి పట్టనట్లు ఉంటున్న దేవదాయశాఖ పరిపాలన యంత్రాంగం. మాజీ మంత్రి&పార్టీ చక్రం తిప్పుతున్న పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు గానీ, మసీదుల ఆస్తులు గానీ, చర్చిల ఆస్తులు గానీ కబ్జా అయిన సందర్భాలు ఎక్కడయినా ఉన్నాయా మన రాష్ట్రంలో.

ఈ నెల 21 న వేలం.
‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమిని కాపాడుకుంటాము’ అంటున్న స్థానిక హిందువులు.