NRI-NRT

సౌదీలో భారత దౌత్యవేత్త లతో ప్రవాస తెలుగు నేతల భేటీ

సౌదీలో భారత దౌత్యవేత్త లతో ప్రవాస తెలుగు నేతల భేటీ

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ప్రవాసీయుల సంక్షేమ, సాంస్కృతిక ఇతరత్రా విషయాలపై తెలుగు ప్రవాసీ ప్రముఖులు ఇటీవల భారతీయ ఎంబసీ అధికారులతో సమావేశమయ్యారు.

పెరిగిపోతున్న తెలుగు ప్రవాసీయుల సమస్యల పరిష్కార విధానాలు మరియు అదే విధంగా ఉల్లాసం కొరకు చేపట్టవల్సిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తీరుతెన్నల గూర్చి తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా అధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ముజమ్మీల్ నేతృత్వంలో ప్రతినిధులు దుగ్గపు ఎర్రన్న, కొరుపొలు సూర్య రావు, చిట్లూరి రంజీత్ కుమార్, గుండబోగుల ఆనందరాజు, జానీ బాషా శేఖ్ మరియు మహేంద్ర వాకాటిలు ఎంబసీ సీనియర్ అధికారి సజీవ్ మరియు ఇతర దౌత్యవేత్తలతో సమావేశమై చర్చించారు. పరిమిత అధికార పరిమితులలో కూడ మానవీయ కోణంతో అనేక మంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సజీవ్ ను అభినందిస్తూ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువ కప్పి సన్మానం చేసారు.

సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయుల సమస్యల పరిష్కారానికి తోటి తెలుగు ప్రవాసీయులు మరింత చొరవ చూపాలని ఈ సందర్భంగా ఎంబసీ అధికారులు తమతో సమావేశమైన ప్రతినిధులకు సూచించారు.