NRI-NRT

ఆస్ట్రేలియా: కాన్‌బెర్రాలో లేడీస్ పింక్ నైట్

ఆస్ట్రేలియా: కాన్‌బెర్రాలో లేడీస్ పింక్ నైట్

నవ్య ఆంధ్ర తెలుగు అసోసియేషన్(NATA) ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో “వెలుగు” పేరిట దీపావళి వేడుకలు నిర్వహించారు. మహిళలు జీవితంలో వెలుగు, వినోదం, స్ఫూర్తి, శక్తీ అనే ప్రధాన అంశాలతో Canberra Women Inspiration Network ప్రారంభించినట్లు నాటా అధ్యక్షురాలు సాహితి పాతూరి తెలిపారు. కార్యక్రమంలో మల్టీ కల్చరల్ అంబాసిడర్ నిషి పూరి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక ఫోటో సెషన్స్, ఫ్యాషన్ షో, ఆట పాటలు అలరించాయి. ఇలాంటి కార్యక్రమాలు ఆస్ట్రేలియా అంతటా విస్తరిస్తామని నాట ఆస్ట్రేలియా ఫౌండర్ ప్రసాద్ త్రిపిరినేని తెలిపారు.