DailyDose

బాబాయ్ హత్య కేసును ముమ్మరం చేసిన జగన్-నేరవార్తలు–06/20

YS Jagan Moves His Uncle Murder Case Faster-June 20 2019-Daily Crime News In Telugu

* ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు స్పీడును పెంచేశారు. ఎన్నికలకు ముందు మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన సొంతింటిలోనే వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం జమ్మలమడుగు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన వివేకా… తెల్లారేసరికంతా రక్తపు మడుగులో కనిపించడం నాడు పెను కలకలమే రేపిందని చెప్పాలి.ఈ హత్యపై టీడీపీ – వైసీపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో వివేకా హత్యకేసు దర్యాప్తు కోసమంటూ నాటి చంద్రబాబు సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించింది. ఓ వైపు సిట్ – మరోవైపు కడప ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తుతో త్వరలోనే ఈ కేసు మిస్టరీ వీడిపోతుందన్న భావన వ్యక్తమైంది. అయితే ఓ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సిట్… ఈ మిస్టరీని ఛేదించడంలో విఫలమైంది.నెలలు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించలేదు. అదే సమయంలో తాజా ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించడం – జగన్ సీఎం కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ క్రమంలో మొన్నామధ్య వివేకా కూతురు తాడేపల్లి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. తన తండ్రి మర్డర్ మిస్టరీని చేధించాలని – నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె జగన్ ను కోరారు.ఈ క్రమంలో ఈ విషయంపై దృష్టి సారించిన జగన్… చంద్రబాబు సర్కారు నియమించిన సిట్ తో ఉపయోగం లేదని – దాని స్థానంలో కొత్తగా మరో సిట్ ను వేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా కొత్త సిట్ ను ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు – ముగ్గురు సీఐలు – నలుగురు ఎస్సైలతో సహా మొత్తం 23 మందితో ఏర్పాటైన ఈ సిట్… ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రంగంలోకి దిగిపోయింది.
* రోడ్డుపై తన కూతురితో నడిచివెళుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కూతురి రోదనలు మిన్నంటాయి. తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళం లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సి.సి.కెమెరాలలో ఈ ఘటన దృశ్యాలు రికార్డు కావడంతో బయటకు వచ్చాయి.
* సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో ఓ మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. నెల్లూరు జిల్లాకు చెందిన షిండే సవాల్ అనే వ్యక్తి తాగిన మైకంలో భార్య రమ(26)ను కత్తితో పొడిచి చంపాడు. భార్య పైన అనుమానంతో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు.
* టీవీ దిగ్గజం ఏక్తా కపూర్‌ తెరకెక్కిస్తోన్న ‘ఫిక్సర్‌’ వెబ్‌ సిరీస్‌ నటులు, సిబ్బంది మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నటి తిగ్మాంషు ధులియా దాడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.
* పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలోని భట్‌పరా ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, నలుగురు గాయపడ్డారు.
*స్నేహితుల మధ్య మనస్పర్థల కారణంగా కలత చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం పెదపలకలూరులో చోటుచేసుకుంది.
*ఈనెల 3వ తేదీన జరిగిన వాయుసేనకు చెందిన ఏఎన్‌‌-32 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో ఇది కూలిపోయింది.
*ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. 29 మందితో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి నగ్రమ్‌ వద్ద ఇందిరా కాల్వలో పడిపోయింది.
*మరిదిపై వదిన పెట్రోలు పోసి నిప్పంటించగా తీవ్రగాయాలపాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అడ్డుకోబోయిన ఆడపడుచు కూడా మంటల్లో చిక్కుకుని దుర్మరణం పాలైంది. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
*కర్నూలు జిల్లా కృష్ణగిరి మండల పరిధిలోని అమకతాడు టోల్ప్లాజా వద్ద వైకాపా నాయకులు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో హల్చల్ చేశారు.
*డేటాచోరీ కేసు నిందితుడు, ఐటీగ్రిడ్ సంస్థ అధినేత అశోక్ మంగళవారం హైదరాబాద్లోని మాదాపూర్ ఠాణా పోలీసుల ఎదుట హాజరయ్యారు.
*నగదు కోసం విజయవాడ రైల్వేస్టేషన్లో వృద్ధురాలిపై దాడికి పాల్పడిన బ్లేడ్ బ్యాచ్కు చెందిన ఆరుగురు నిందితులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వృద్ధురాలు (70) మంగళవారం రాత్రి ఉయ్యూరు వెళ్లేందుకు విజయవాడ రైల్వేస్టేషన్కు వచ్చారు.
*మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ పోలీసులకు సవాల్గా మారింది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ హత్య కేసును ఛేదించేందుకు కొత్త ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక బృందాన్ని నియమించింది.
*దివ్యాంగుడిని వివాహం చేసుకుంటుందనే కోపంతో ఓ యువకుడు తన చిన్నమ్మ కుమార్తె గొంతు కోసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది.
*ఆర్థిక అక్రమాల కేసులో ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంస్థకు చెందిన ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టుచేసింది. సంస్థ మాజీ సంయుక్త ఎండీ అరుణ్ కె.సాహా, రవాణా విభాగం ఎండీ కె. రామ్చంద్లను ముంబయిలో అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
*ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి అనుమతులు ఇప్పిస్తానని నగదు తీసుకుని మోసం చేశారని వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు కుమార్తెతోపాటు మరో ఇద్దరిపై బుధవారం కేసు నమోదైంది. ఈ మేరకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు వివరాలు వెల్లడించారు.
*దివ్యాంగ సంక్షేమ శాఖ ద్వారా నడిచే వృద్ధుల డేకేర్ కేంద్రాల అనుమతుల కోసం లంచం అడుగుతూ ప్రకాశం జిల్లా దివ్యాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు అడ్డంగా దొరికిపోయారు.
*ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడిచేసిన కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు విజయవాడలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐయే) ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దుచేయాలని ఎన్ఐయే తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) జి.సిద్దిరాములు హైకోర్టులో వాదనలు వినిపించారు.
*చెట్టు కొమ్మ ఆరేళ్ల నిరుపేద బాలుడిని చిదిమేసింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మారీసుపేట మఠం బజార్లోని పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఈ విషాద ఘటన చోటు చేసుకొంది.
*ఝార్ఖండ్లోని సిమ్డెగ జిల్లాలో సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. బనో బ్లాకు పరిధిలోని ఉర్మి అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు కచ్చితమైన సమాచారం అందడంతో భద్రతాదళాలు అక్కడకు వెళ్లినట్లు దనపు డీజీపీ (ఆపరేషన్) మురారిలాల్ మీనా చెప్పారు. మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు తెలిపారు.
*ఓ ప్రయాణికుడు విమానంలోని సీటు కింద ఐదు బంగారం బిస్కెట్లను పడేసి వెళ్లిపోయిన సంఘటన బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి రూ. 19.5 లక్షల విలువగలవాటిని స్వాధీనం చేసుకున్నారు.
*తమిళనాడులో ఉగ్ర దాడులకు కుట్ర జరిగినట్లు తెలియడంతో చెన్నైలోని పుళల్ కేంద్ర కారాగారంలోని కొందరు ఖైదీలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విచారించారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధి ప్రాంతానికి చెందిన మహిళ(28)కు ఇద్దరు ఆడ పిల్లలు. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి ఎనిమిదేళ్లు. ఆమె భర్త కొంతకాలం క్రితమే మరణించాడు. ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె సింగరేణి కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్తో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.
*ఊరకుక్క దాడిలో ఐదేళ్ల బాలుడికి తీవ్రగాయాలైన సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలోని కొండామర్రి పంచాయతీ కోటూరులో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన సాధిక్ కుమారుడు ఆలీమ్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా అక్కడి కోళ్లఫారం వద్దకు వచ్చిన కుక్క బాలుడిపై దాడికి పాల్పడి అతని చెంప భాగాన్ని కొరికి తీవ్రంగా గాయపరచింది. వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.
*కర్నూలు జిల్లా డోన్ సమీపంలో వైకాపా నేతలు హల్చల్ సృష్టించారు. కృష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద రుసుం అడిగిన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి
* హైదరాబాద్‌ జుమ్మెరాత్‌ బజార్‌లో….. రాణి అవంతిభాయ్‌ విగ్రహం ఏర్పాటుపై నిన్న అర్థరాత్రి….. తీవ్ర వివాదం చోటు చేసుకుంది. విగ్రహ ఏర్పాటు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చేయి చేసుకున్నారు పోలీసులు. దీంతో రాజా సింగ్‌కు గాయాలయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు జుమ్మెరాత్‌ బజార్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేఫథ్యంలో అక్కడ భారీగా పోలీసులు ఉన్నారు.