ట్విటర్‌ను ఎలాన్ మస్క్ పూర్తిగా సొంతం చేసుకున్నారు. 4,400 కోట్ల డాలర్ల ఈ డీల్ పూర్తయినట్లు సంస్థకు చెందిన ఇన్వెస్టర్లలో ఒకరు వెల్లడించారు.
ట్విటర్‌ను టేకోవర్ చేసిన వెంటనే మస్క్ ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్-పాలసీ-ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా పలువిభాగాల హెడ్‌లను తొలగించారు.
ట్విటర్ ఇన్వెస్టర్ రాస్ గెర్బర్ ఈ విషయాలను ‘బీబీసీ’తో చెప్పారు. కాలిఫోర్నియాలోని గెర్బర్ కవసాకీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్.
”కోర్టు గడువు మస్క్‌ను తొందరపెట్టిందని భావిస్తున్నాను” అని గెర్బర్ అన్నారు.
మరోవైపు ఎలాన్ మస్క్ కూడా ‘పక్షికి స్వేచ్ఛ లభించింది’ అంటూ ట్వీట్ చేశారు.