విశాఖ అక్రమ కేసుల్లో జైలు పాలై.. గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిలుతో విడుదలైన తొమ్మిది మంది జనసేన నాయకులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా సత్కరించారు. శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ పార్టీ నేతలు.. వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు
*శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన విశాఖ జనసేన నేతలు… శ్రీ కోన తాతారావు, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ సందీప్ పంచకర్ల, శ్రీ పీవీఎస్ఎన్ రాజు, శ్రీ పీతల మూర్తి యాదవ్, శ్రీమతి కొల్లూరు రూప, శ్రీ రాయపురెడ్డి కృష్ణ, శ్రీ శ్రీనివాస పట్నాయక్, శ్రీ చిట్టిబిల్లి శ్రీను***
అమరావతి
ట్విట్టర్ లో ..కామెంట్స్
తేది : 29-10-2022
యస్.విష్ణువర్ధన్ రెడ్డి
బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి.
ఇది సీమకు ద్రోహం కాదా!
👉రాయలసీమకు రాజధాని అవసరం లేదు
– మంత్రి పెద్దిరెడ్డి
👉సీమకు న్యాయ రాజధాని కోసం ఉద్యమం చేస్తాం
– భూమన కరుణాకర్ రెడ్డి.
రాజధానిమీద మీలోమీకే ఒక స్పష్టత లేదు! కనీసం సీమ అభివృద్ధికి గత 40నెలలు మీ పాలనలో ఖర్చుపెట్టిన నిధులు వైసీపీ పార్టీ ప్రజలు ముందు పెట్టండి.******
అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడైన జగన్ మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బెయిలు రద్దుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. జగన్ మోహన్‌రెడ్డి బెయిలు షరతులను ఉల్లంఘించారని చెప్పేందుకు ఒక్క ఘటనను కూడా పేర్కొనలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాబట్టి బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తన తీర్పులో స్పష్టం చేశారు.
జగన్ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలను వెల్లడించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి సహ నిందితులకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తారన్నవి సరైన కారణాలు కావని హైకోర్టు పేర్కొంది. బెయిలు రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు గతేడాది సెప్టెంబరు 15న కొట్టివేసిందని గుర్తు చేసిన న్యాయస్థానం.. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవని సీబీఐ పేర్కొందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత బెయిలు రద్దు కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తన తీర్పులో పేర్కొన్నారు.
కాగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన బెయిలును రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.****
గుంటూరు బ్రేకింగ్
.గుంటూరు. హత్య కు మాస్టర్ స్కెచ్ వేసిన నిందితులు
ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మధ్య నెలకొన్న వివాదం
పోలీసుల అదుపులో నిందితులు?
ఆర్ధిక లావాదేవిలా? మరేదైనా కారణం మా అన్న కోణంలో విచారణ
కత్తులు వేట కొడవళ్ళు కారు నగదు స్వాధీనం
వేట కొడవళ్ళు.కత్తులు విజయవాడ నుంచి తీసుకు వచ్చి నట్లు తెలుస్తుంది
అర్థరాత్రి విశ్వసనీయ సమాచారం తో స్పందించిన గుంటూరు పోలీసులు
అర్థరాత్రి స్పందించకుంటే బాధితుడు హత్య కు గురియ్యేవడని బాధితుడు వెల్లడి
హత్య చేసిన తరువాత తెల్లవారు జామున కారులో పరార్ కావాలని నిందితుల నిర్ణయం అయినట్లు దర్యాప్తు లో వెల్లడి
నిందితులు హత్య కు ఎంత మొత్తంలో తీసుకున్నారు .ఎంత ముందుగా ఇచ్చారు అన్న కోణంలో అరా తీస్తున్న పోలీసులు
గతంలో ఉన్న ఎస్పీ అమ్మి రెడ్డి ఉన్న సమయంలో ఇలాంటి హత్య కేసును చెందించి సిఐ
దర్యాప్తు చేస్తున్న పోలీసులు?****
వినియోగదారునికి అనుగుణంగా కన్జ్యూమర్ కోర్టు తీర్పు
కాకినాడ అక్టోబర్ 29: వినియోగదారునికి అనుగుణంగా కాకినాడలోని జిల్లా కన్జ్యూమర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు వల్ల వినియోగదారునికి మేలు జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను ఇలా ఉన్నాయి.
కాకినాడ జగన్నాధపురం ప్రాంతానికి చెందిన సూరాడ సత్య అజయ్ కుమార్ రెండేళ్ల క్రితం సామ్సంగ్ ఎస్ 20 ప్లస్ మోడల్ గల మొబైల్ ఫోనును సుమారు 48 వేల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత కంపెనీ సాంకేతిక లోపం, స్క్రీన్పై పచ్చగీతలు రావడంతో సామ్సన్ మొబైల్ డీలర్ను సంప్రదించారు. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా తనకేమీ సంబంధం లేదంటూ డీలర్ తప్పించుకున్నారు. అజయ్ కుమార్ కాకినాడలో ఉన్న కన్జ్యూమర్ కోర్టులో కంపెనీ యాజమాన్యంపై కోర్టులో కేసు వేసి తానే స్వయంగా వాదనను వినిపించారు. దీంతో అజయ్ కుమార్ను మానసికంగా బాధించినందుకుగాను 15 వేల రూపాయలు నగదు ఇవ్వాలని, అలాగే కోర్టుకు తిరిగినందుకుగాను 2వేల రూపాయలు ఇచ్చి మొబైల్ ఫోన్ను యధావిధిగా రిపేరు చేసి ఇవ్వాలంటూ కజ్యూమర్స్ కోర్టు తీర్పు చెప్పినట్లు అజయ్ కుమార్ చెప్పారు. కన్జ్యూమర్స్ కోర్టు అధ్యక్షుడు సిహెచ్ రఘుపతి వసంత కుమార్ నేతృత్వంలో సభ్యులు చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ సాగిందని అజయ్ కుమార్ చెప్పారు. ఈ కన్జ్యూమర్ కోర్టు తీర్పు వల్ల ఈ తరహా మొబైల్ కొనుగోలు చేసిన పలువురికి న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
కోర్టు తీర్పు ఈ నెల 13వ తేదీ ఇచ్చిన తనకు సంబధిత వివరాలు రెండు రోజుల క్రితమే అందినట్లు శనివారం అజయ్ చెప్పారు.*****
నెల్లూరు జిల్లా ….
💥పోలీసుల సమయస్ఫూర్తి తో నిలిచిన రెండు నిండు ప్రాణాలు💥
💥తల్లితండ్రులని చంపేందుకు సుఫారీ ఇచ్చిన కసాయి కొడుకు… కుట్రను భగ్నం చేసిన కావలి రూరల్ పోలీసులు💥
👉తండ్రిని చంపితే 3లక్షలు, తల్లిని చంపితే ఐదు లక్షలు సుఫారి…కత్తులు కొన్నాడు కారులో పెట్టాడు,రెక్కీ నిర్వహించారు..కావలికి చెందిన ఈ నరరూప రాక్షసుడి పేరు మురుసు లక్ష్మి నారాయణ
పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు నేరస్తులను అదుపులోకి తీసుకున్న బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు, వారి వద్ద నుండి రెండు లక్షల 95 వేల రూపాయలు విలువ చేసే 94 గ్రాములు బంగారం మరియు 30 వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు,వీరిని విచారించగా భార్యా భర్తలు ఇద్దరినీ హత్యచేయడానికి కూడా పథకం వేసినట్టు వెల్లడి దీంతో హత్యల కుట్రను బగ్నం చేసిన జిల్లా పోలీసులు,,..
నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారు…
ముత్తుకూరు మండలానికి చెందిన షేక్ గౌస్ బాషా, బుచ్చి రెడ్డి పాలెం పట్టణానికి చెందిన షేక్ షాహుల్ అనే ఇద్దరు నేరస్తులు పలు దొంగతనాలు కేసుల్లో ముద్దాయిలుగా వుండి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో జైల్లో కావలి పట్టణానికి చెందిన షేక్ షఫీ అనే వ్యక్తి తో పరిచయమైనట్టు, కావలి పట్టణానికి చెందిన మురుసు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆస్తి వాటా పంపకాలలో తన తల్లిదండ్రులు తనకు అన్యాయం చేశారని వారిద్దరినీ హత్య చేస్తే తండ్రిని చంపినందుకు మూడు లక్షలు, తల్లిని చంపితే 5 లక్షలు ఇచ్చే విధంగా సుఫారీ ఇస్తాడని కావలికి చెందిన షేక్ షఫీ మిగతా ఇద్దరు గౌస్ బాషా,షేక్ షాహుల్ కు తెలియ చేయగా లక్ష్మినారాయణ తల్లి,తండ్రులు ను హత్య చేయుటకు ముగ్గురూ కలిసి రెక్కీ ఆటో లో పలు దఫాలు నిర్వహించినట్లు,ఈ క్రమంలో హత్యకు ఉపయోగించుట కు కత్తులు కూడా కొని లక్ష్మీ నారాయణ కు చెందిన స్విఫ్ట్ డిజైర్ కార్ లో ఉంచినట్టు, దొంగతనం కేసులో ముద్దాయిలని అరెస్ట్ చేయగా హత్యకు సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చినట్టు దీంతో కార్ తో పాటు కత్తులు కూడా స్వాదీనం చేసుకున్నామని,, దొంగతనం కేసు చేదించడంతోపాటు రెండు హత్యలను ఆపడంలో బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కావలి రూరల్ పోలీసులు ఉత్తమ ప్రతిభ చూపారని వారిని అభినందించిన జిల్లా ఎస్పీ విజయరావు….