ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయకుండా 48 గంటల నిషేదం
మా ఊరికి రండి.. ప్రచారానికెళ్తే పైసలిస్తున్నారు
నల్గొండ : ప్రచారానికి వెళ్తే నాలుగు పైసలు వెనకేసుకోవచ్చు అంటూ మునుగోడు నియోజకవర్గ ప్రజు ఇతర ప్రాంతాల్లోని బంధుమిత్రులను పిలుస్తున్నారు. పోలింగ్ చేరువవుతుండటంతో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఒకరోజు ప్రచారానికి వెళ్తే, రెండు పూటలూ భోజనం పెట్టి, రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. పొద్దస్తమానం పనిచేస్తే వచ్చే కూలిడబ్బులకు రెట్టింపు నాలుగైదు గంటల్లోనే సంపాదించుకోవచ్చు.. అక్కడెక్కడో కష్టపడే బదులు మా ఊరికి రండి.. మా ఇంట్లోనే ఉండొచ్చు. మమ్మల్ని చూసినట్లూ ఉంటుంది.. ప్రచారానికి వెళ్లి నాలుగు పైసలు వెనకేసుకోవచ్చు.. అంటూ మునుగోడు నియోజకవర్గ వాసులు ఇతర ప్రాంతాల్లోని బంధుమిత్రులను పిలుస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ చేరువవుతుండటంతో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుండటంతో ప్రచారానికి అభ్యర్థులు పెద్దపీట వేస్తున్నారు. వెంట భారీగా కార్యకర్తలు, స్థానికులు ఉండాలని భావిస్తున్నారు. అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలు, కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు.పార్టీలకు సంబంధం లేని ప్రజలనూ పిలుస్తున్నారు. ఒకరోజు ప్రచారానికి వెళ్తే, రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. రెండు పూటలా భోజనం పెడుతున్నారు. అభ్యర్థులు, ముఖ్య నాయకులు వచ్చినప్పుడు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికే వారికి అదనంగా రూ.500-1000 చెల్లిస్తున్నారు.
ఒక్కోరోజు గ్రామంలో రెండు లేదా మూడు పార్టీల ప్రధాన నేతల ప్రచారం ఉంటోంది. ఈ సమయంలో ప్రచారానికి జనాన్ని తరలించడం సమస్యగా మారింది. స్థానిక నేతలు సైతం తెలిసిన వారిని, బంధుమిత్రులను పిలవమని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లు ఇతర ప్రాంతాల్లోని బంధువులను ఆహ్వానిస్తున్నారు. ఎక్కువగా మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రెస్ రిలీజ్ — ప్లీజ్ క్యారీ
—————————————
సిపిఐ నాయకులతో కలిసి సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి, మర్రిగూడ మండలాలలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బోయినపల్లి వినోద్ కుమార్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి, మర్రిగూడ మండలాలలో సిపిఐ నాయకులతో కలిసి శనివారం విస్తృతంగా పర్యటించారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు వినోద్ కుమార్ కమ్యూనిస్టు కోటలో సిపిఐ నాయకులతో కలిసి ప్రచారం చేశారు.
సిపిఐ పార్టీకి చెందిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు బొమ్మగాని ప్రభాకర్, సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి సత్యం, నాంపల్లి మండల కార్యదర్శి రమేష్ లతో కలిసి కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ మూడు మండలాలలో విస్తృతంగా ప్రచార పర్వంలో పాల్గొన్నారు.
టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సహోదర్ రెడ్డి, భూదాన్ యజ్ఞ బోర్డ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డిలతోపాటు సిపిఐ నాయకులతో కలిసి వినోద్ కుమార్ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై సమాలోచనలు జరిపారు.
రాష్ట్ర గీత కార్మికుల సంఘాల నాయకులతో కూడా వినోద్ కుమార్ సమావేశమై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వైద్యపరీక్షల అనంతరం మొయినాబాద్ పీఎస్ కు నిందితుల తరలింపు. నిందితుల స్టేట్మెంట్ రికార్డు అనంతరం వారిని దిల్సుఖ్ నగర్ లోని ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తరలించనున్నారు. న్యాయమూర్తి ఆదేశాల తర్వాత వారిని రిమాండ్ కు తరలించనున్న పోలీసులు. నిన్నటి రిమాండ్ రిపోర్ట్ కు అదనంగా నేడు మరో రిపోర్ట్ రూపొందించి జత చేయనున్నట్లు సమాచారం..