మునుగోడు : తెరాస vs బీజేపీ
ఇప్పటి వరకూ వచ్చిన సర్వేస్ లో తెరాస వైపే కొంచెం మొగ్గు కన్పిస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కూడా తెరాసకీ కలిసే వచ్చే అవకాశం.
తెరాస కీ అభ్యర్థి చాలా మైనస్.
కొన్ని సర్వేలో బీజేపీ గెలుస్తుంది అని చెబుతున్నా మెజారిటీ సర్వేస్ 2nd పోసిషన్ అంటున్నాయి..రాజగోపాల్ ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన అభ్యర్థి అయినప్పటికీ తన వెనుక కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వెళ్ళలేదు, హుజురాబాద్లో కన్నా మెరుగైన ఓట్లు కాంగ్రెస్ సాధించవచ్చు.. కాంగ్రెస్ పూర్తిగా బలహీనం అవ్వకపోవడం రాజగోపాల్కీ దెబ్బతీస్తుంది.
కాంగ్రెస్ కోల్పోయే మెజారిటీ ఓటు బ్యాంకు బీజేపీ వైపు, కొంత BSP వైపు, ముస్లిమ్ కమ్యూనిటీ తెరాస వైపు వెళ్తున్నట్టు కన్పిస్తుంది.. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ధికంగా మిగిలిన వారితో పోటీ ఇవ్వలేకపోతుంది, మహిళల ఓట్లు మీదే ఎక్కువ అసలు పెట్టుకున్నారు.
ఇప్పటి వరకూ నల్గొండలో జరిగిన 2 బై ఎలక్షన్స్ లో ప్రధాన పోటీ తెరాస, కాంగ్రెస్ మధ్యనే ఉంది.. రెండు చోట్ల తెరాస గెలిచింది..మొదటి సారీ దక్షిణ తెలంగాణాలో బీజేపీ కాంగ్రెస్ని క్రాస్ చేస్తుంది.. ఒక వేళ బీజేపీ గెలిస్తే, ఖమ్మం, నల్గొండ నుండీ కూడా బాగా చేరికలు ఉండవచ్చు.