Food

గోధుమల్లో ఘనమైన పోషకాలు

Wheat has lots of nutrients-Have them without fail in your meals.

గోధుమరంగు… అనగానే ఇంతవరకూ మదిలో మనకి ఒక రంగే గుర్తుకొచ్చేది. ఇక నుంచి గోధుమరంగు అనగానే ఊదా, నీలం, నలుపు రంగులు కూడా గుర్తుకురావాలేమో! ఎందుకంటే మన దేశంతోపాటు ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, సింగపూర్‌, చైనా దేశాలు.. నీలి, నలుపు రంగు గోధుమల్ని పండిస్తున్నాయి. ఇలా రంగులు మార్చడం వెనుక ఏం ప్రయోజనం ఉంటుందనే అనుమానం రావొచ్చు. ఈ రంగు గోధుమల్లో యాంథోసయానిన్‌ పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ యాంథోసయానిన్లు బరువు తగ్గించుకోవడానికి, గుండెజబ్బులు అదుపులో ఉంచడానికి, మధుమేహ నివారణకి ఉపకరిస్తాయని పరిశోధనల్లో తేలింది. ఫలితంగా… భారతీయ ఆహార ఉత్పత్తి సంస్థలు నీలి, నలుపు, ఊదా రంగు గోధుమలని పండించడానికి ముందుకొచ్చాయి. ఇప్పటికే సింగపూర్‌లో కోకా పర్పుల్‌ సంస్థ ఊదా రంగు నూడుల్స్‌ని తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసింది. త్వరలో బిస్కెట్లు, బ్రెడ్‌తోపాటు చపాతీ, పరోటా, పుల్కా, పూరీ, పిజా, బిస్కెట్‌, కేక్‌, బర్గర్లు సైతం నీలం, ఊదా వంటి నోరూరించే రంగుల్లోకి మారబోతున్నాయన్నమాట. తక్కిన వర్ణాలతో పోలిస్తే నలుపు రంగు గోధుమల్లో యాంథోసయానిన్లు అధికంగా ఉండటంతోపాటు ఆ ఉత్పత్తుల ధరలు కూడా అన్నింటికంటే ఎక్కువగా పలుకుతున్నాయట.