Movies

వాల్తేర్‌ వీరయ్య’తో హుషారుగా..

Auto Draft

ప్రత్యేక గీతాల్లో తన అందచందాల ప్రదర్శనతో యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌటేలా. తాజాగా ఈ సుందరి.. చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్‌ వీరయ్య’ చిత్రంలో ఐటెంసాంగ్‌లో నర్తించింది. ఇటీవలే భారీ సెట్‌లో ఈ స్పెషల్‌సాంగ్‌ను చిత్రీకరించారు. హుషారెత్తించే మాస్‌బీట్‌తో దేవిశ్రీప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు.
బాలీవుడ్‌లో పలు ఐటెం గీతాల్లో మెరిసిన ఊర్వశి రౌటేలా తొలిసారి తెలుగులో చేస్తున్న స్పెషల్‌ సాంగ్‌ ఇదని చిత్రబృందం పేర్కొంది. విశాఖపట్నం నేపథ్యంలో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ‘వాల్తేర్‌ వీరయ్య’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతిహాసన్‌ కథానాయిక. రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది.