శ్రీదుగ్ధేశ్వరనాథ్- రుద్రపూర్- ఉత్తరప్రదేశ్
మధ్యప్రదేశ్ లోని ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం ‘మహా కాళేశ్వర్’ కి ఉపలింగంగా ప్రసిద్ధి ఈ శ్రీదుగ్ధేశ్వరనాథ్ క్షేత్రం.ఇక్కడ శివలింగం పానువట్టం మీద లింగం ఉండదు. భూమిలోంచి లింగం ఆవిర్భవించింది. అంతులేని లోతు నుండి జనించిన లింగమూర్తి.ఇక్కడ పరమేశ్వర శివలింగం కదులుతుంది.ప్రతీ క్షణం కదులుతుంది అని నిర్దిష్టంగా చెప్పలేము. ప్రతీ రోజు శివ అనుగ్రహం తో లింగం కదలడం ప్రారంభిస్తే ఒక గంట, ఒక పూట, ఒక్కోసారి పూర్తిగా 24 గంటలు కదులుతుంది.ఒకసారి కదలడం ఆగితే ఇక ఎంత ప్రయత్నించినా ఎంతమంది కూడినా అంగుళం కూడా ఇక ఆరోజుకు కదలదు.తిరిగి మర్నాడే కదలిక ఉండేది.స్వామి సంకల్పం ప్రకారం జరిగే ఈ లీల ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటి.ఈ అద్భుతమైన శైవక్షేత్రం ఉత్తర ప్రదేశ్ లోని డియోరియా జిల్లాలోని రుద్రపూర్ గ్రామంలో ఉంది. 11 వ శతాబ్దం అష్టభుజిలో నిర్మించిన ప్రసిద్ధ దుగ్ధేశ్వరనాథ్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలతో కూడిన ప్రసిద్ది చెందిన క్షేత్రం. ఈ దుగ్ధేశ్వరనాథ్ క్షేత్రం లో ఉన్న శివలింగం పొడవు పాతాళం వరకు ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించిన శివలింగం భూమి నుండి కనిపించింది. మానవ ప్రతిష్ట కాదు. దుగ్ధేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు తమ కోరికలు తీరడానికి మరియు నెరవేర్చడానికి శివయ్య ఇక్కడ కొలువైఉన్నారు అని బలంగా నమ్ముతారు. శివలింగం స్పృశించడానికి భక్తులు 14 మెట్లు లోనికి దిగుతారు. శివలింగం ఎల్లప్పుడూ భక్తుల ద్వారా సమర్పింపబడ్డ పాలు, నీరు అర్పించడంతో మునిగి ఉంటుంది. శ్రీదుగ్ధేశ్వర్ నాధ్ మహాదేవ్ ఆలయాన్ని రుద్రపూర్ రాజు నిర్మించారు.అనేక వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం దట్టమైన అడవులతో చుట్టుముట్ట బడిందని మరియు కొంతమంది గొర్రెల కాపరులు తమ ఆవులను పోషించడానికి వచ్చేవారు.స్థానిక కథనం ప్రకారం, అడవిలోని ఒక మట్టిదిబ్బ దగ్గర ఒక గోమాత పాలు ప్రవహించడం ప్రారంభించాయి. అప్పటి రాజా హరిసింగ్‌కు ఈ విషయం తెలిసింది. తవ్వకం తరువాత, ఒక శివలింగం కనిపించింది, కాని శివలింగాన్ని తొలగించడానికి తవ్వకం జరుగుతుండగా, అతి పెద్ద శివలింగం బయల్పడింది.తరువాత, అప్పటి రాజు హరి సింగ్ 11 వ శతాబ్దంలో కాశీ పండిట్లను పిలిచి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఈ పురాతన ఆలయం యొక్క వివరణ శివ పురాణంలో ఉందని ఆలయ పూజారులు ద్వారా తెలుస్తోంది.దుగ్ధేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయానికి మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగ, ఉజ్జయిని వంటి ప్రాముఖ్యత ఇవ్వబడింది……
1. శ్రీవారు ‘శ్రీమంతుడు‘
శ్రీవారి నగదు, బంగారం డిపాజిట్ల వివరాలు టీటీడీ (TTD) ప్రకటించింది. 24 బ్యాంకుల్లో మొత్తం రూ.15,938 కోట్ల డిపాజిట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. శ్రీవారి నగదు, బంగారం డిపాజిట్ల వివరాలు టీటీడీ (TTD) ప్రకటించింది. 24 బ్యాంకుల్లో మొత్తం రూ.15,938 కోట్ల డిపాజిట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. శ్రీవారి ఆలయ మొత్తం బంగారం (gold) 10,258 కేజీలు ఉందని తెలిపారు. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా టీటీడీ పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. ఇప్పుడు 10,258. 37కి చేరిందని టీటీడీ ప్రకటించింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఏడుకొండలు ఎక్కి, తిరుమలలో శ్రీవారి దర్శనంతో అలౌకికమైన ఆనందానుభూతిని మూటకట్టుకునే భక్తులు… ఆ స్వామికి కానుకల సమర్పణలో కూడా అమితమైన ఆత్మతృప్తిని పొందుతారు. అదేం మహిమోగానీ వడ్డీకాసులవాడి ‘హుండీ’ అనునిత్యం కానుకలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడిదాకా ఆ కోనేటి రాయుడికి రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. తిరుమల వెంకన్నకు నాటి ఆకాశరాజు నుంచి నేటి భక్తుల దాకా… తమ స్థాయిని బట్టి నగదు, ఆభరణాలు సమర్పించుకుంటున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా శ్రీవారి ఖజానాకు హుండీ ద్వారా నగదు, బంగారం, వెండి కానుకలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.
17వ శతాబ్దం ముందు నుంచే…
శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించే వస్త్రంతో కూడిన గంగాళాన్ని ‘హుండీ’ అంటారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు. 17వ శతాబ్దానికి ముందు నుంచే శ్రీవారి ఆలయంలో హుండీ ఉన్నట్టు దేవస్థానం రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆర్థికంగా బలపడేందుకు ఎన్నో మార్గాలు ఏర్పడినప్పటికీ టీటీడీ మాత్రం హుండీ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. హుండీలో భక్తులు తమ స్తోమతకు తగిన విధంగా నగదు, బంగారు, వెండి, బియ్యం, వస్ర్తాలు, విలువైన పత్రాలు వంటి వాటిని కానుకలుగా వేస్తారు.
2. పుష్కర స్నానానికి కి వెళ్లేటప్పుడు తీసుకోవలసిన నియమాలుసనాతన సంప్రదాయంలో స్నానం అత్యంత ప్రధానమైన ఆచారం. భగవంతుడి విభూతిని సంతరించుకోవటానికి అత్యంత ప్రధానమైన ఉపకరణం. అందుకే స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. పుష్కర స్నానానికి ఇంటి నుంచి బయలుదేరే సమయంలో‘‘సర్వదా సర్వదేదేశూ పాపుత్వాం భువనేశ్వరీ మహామాయా జగత్‌ధాత్రీ సచ్చిదానంద రూపిణీ’’ అని అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరాలి. పుష్కర స్నానం ఆచరించడానికి వెళ్తున్న మాకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడు తల్లీ అనేది ఈ ప్రార్థన ఉద్దేశం. ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే చిటికెడు మృత్తిక (మట్టి)ను ఓ కాగితంలో చిన్న పొట్లం కట్టి వెంట తీసుకెళ్లండి.ఇక నదిలోకి దిగిన తర్వాత వీలైతే కూర్చోవాలి. నీళ్లు తీసుకొని, శిరస్సు మీద మూడు పర్యాయాలు పుండరీకాక్ష అంటూ చల్లుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేయాలి. సంకల్పం (మీ పేరు గోత్ర నామాలు) చెప్పుకోవాలి. ఇంటి నుంచి తెచ్చిన మృత్తికను చేతిలో ఉంచుకుని.
“పిప్పలాదాత్సముత్పన్నే
కృత్యేలోక భయంకరి
మృత్తికాంతేమయాదత్తా
మహారార్ధం ప్రకల్పయ”
అన్న శ్లోకం చదివి ఆ మట్టిని నదిలో వదిలివేయాలి. ఆ తర్వాత నదిలోపలికి ప్రవేశించి- మూడుసార్లు తల మునిగేటట్లు స్నానం చేయాలి. పుష్కర స్నానం చేసే సమయంలో పక్కవారితో మాట్లాడకూడదు
3. శ్రీవారి సుదర్శన పుష్కరిణిలో శనివారం రాత్రి జరగనున్న స్వామివారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పచ్చి పూల మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపాన్ని విద్యుద్దీపతోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. పలు దేవ తామూర్తుల విద్యుత్ కటౌట్‌లు, పుష్కరిణి చుట్టూ మెస్‌లను అమరుస్తున్నారు. సాగర పరిసరాలు విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఉభయనాం చారులతో కొలువైన చినవెంకన్న తొళక్కవాహనంపై తిరు వీధుల్లో ఊరేగి అనంత రం రాత్రి ఎనిమిది గంటలకు పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. తెప్పోత్సవ వేడు కను వీక్షించేందుకు భక్తులు తరలిరావాలని ఈవో వేండ్ర త్రినాథరావు కోరారు.
4. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న 04-11-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,670 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 30,475 మంది…నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.79 కోట్లు …
సర్వదర్శనానికి 31 కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు…శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం…
టైం స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం… 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…