Politics

కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి..ఆ తృప్తే వేరు

కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి..ఆ తృప్తే వేరు

వైకాపా ప్రభుత్వం దిక్కుమాలిన పనులు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శిశుపాలుడిలా సీఎం జగన్‌ చేసిన తప్పులు 100 దాటిపోయాయని.ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చారని ఆక్షేపించారు. సీఎం జగన్‌ చేస్తున్న అరాచకాలకు జవాబు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ”600 ఇళ్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరిస్తారా?
అంత అవసరముందా?. వైకాపా దుర్బుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా?విస్తరణ అంటున్నారు.. అసలు ఏనాడైనా రహదారులు వేశారా? జనసేన అధినేత పవన్‌ పర్యటన అడ్డుకుంటేనో.. తెదేపా పర్యటన సమయంలో రాళ్లు వేస్తేనో పైచేయి సాధించలేరు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూపించండి.. ఆ తృప్తి ఎలా ఉంటుందో తెలుస్తుంది” అని చంద్రబాబు తెలిపారు.