* తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో కీలక నిందితుడుగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ ఎట్టకేలకు దిగొచ్చారు. విచారణకు సిద్ధమంటూ బుధవారం ప్రత్యక్షమయ్యారు. విచారణకు సిద్ధమంటూ బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అశోక్.
అయితే విచారణలో భాగంగా సిట్ ఎదుట హాజరుకావాలని పోలీసులు సూచించారు. దీంతో గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు అశోక్. గురువారం ఉదయం 11 గంటలకు గోషామహాల్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు ఐటీ గ్రిడ్ ఎంపీ అశోక్.
*భూమ్మీద నమోదైన అతివేడి ఉష్నోగ్రటాలి వెనంటూ వచ్చిన రిపోర్టులో రెండింటిని ప్రపంచ వాతావరణ సంస్థ ఆమోదించింది. 2016 జులై 21మే 28న పాకిస్తాన్ లోని తుర్భాజ్ ప్రాంతంలో 53.7 డిగ్రీల వేడి కాక పుట్టించిందని వివరించింది. ఆసియా ఖండంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా మిత్రిబాను గుర్తిస్తున్నట్లు డబ్ల్యుఎం ఓ వెల్లడించింది. మిత్రిబా తుర్బాట్ ప్రాంతాల్లో నమోదైన వేడికి 76 ఏళ్లలో భూమ్మీద రికర్డైన ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు స్తానాలున్నట్లు డబ్ల్యుఎంవో చెప్పింది. 2003 జూన్ 30న అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఫర్నేస్ క్రీక్ ప్రాంతంలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
* ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్యానల్ స్పీకర్ గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ముదునూరి ప్రసాదరాజు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, పార్టీకి విధేయుడుగా ముదునూరి ప్రసాదరావు వ్యవహరించిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమంత్రి పదవిని కాస్తా ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు తన్నుకుపోయారు. ఈ నేపథ్యంలో ముదునూరి ప్రసాదరాజు బుజ్జగించేందుకు ప్యానల్ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.
* సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ లీగ్ దశలో మరో మ్యాచ్‌కు రెడీ అయింది. వెస్టిండీస్‌పై భారీ స్కోరును ఛేజ్ చేసి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉన్న బంగ్లాదేశ్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది.
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్‌కు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు జలవనరులశాఖ మంత్రి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు పర్యటనలో పాల్గొన్నారు.
* రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్ల పాలన జులై 5వ తేదీన, మిగతా 4 జడ్పీల పాలన ఆగస్టు7న ఆరంభం కాబోతున్నాయి. ఆ రోజుల్లో.. వాటన్నింటిలో నూతన పాలకవర్గాలు, సభ్యులతో మొదటి భేటీలను నిర్వహిస్తారు.
* ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంలో ఉపాధి కల్పించేందుకు అయిదు నెలల శిక్షణ కోర్సులు నిర్వహించనున్నట్లు ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ ఎండీ లచ్చిరాం తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
* రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్ల పాలన జులై 5వ తేదీన, మిగతా 4 జడ్పీల పాలన ఆగస్టు7న ఆరంభం కాబోతున్నాయి. ఆ రోజుల్లో.. వాటన్నింటిలో నూతన పాలకవర్గాలు, సభ్యులతో మొదటి భేటీలను నిర్వహిస్తారు.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల మధ్య కుదిరిన అంగీకారం మేరకు తెలంగాణలోని ఏపీ సచివాలయభవనాల అప్పగింత ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే కె బ్లాక్, హెచ్ (ఉత్తర) బ్లాక్లను ఏపీ అధికారులు తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ అధికారులకు అప్పగించారు.
* ఐఐటీలతో పాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించడానికి చాలామంది సిద్ధమవుతుంటారు. మంచి ర్యాంకు సాధించిన తర్వాత కూడా ప్రవేశాల సమయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వీటిని తీర్చేందుకే సంగారెడ్డిజిల్లా కందిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్లో ఓపెన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
* రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్ల పాలన జులై 5వ తేదీన, మిగతా 4 జడ్పీల పాలన ఆగస్టు7న ఆరంభం కాబోతున్నాయి. ఆ రోజుల్లో.. వాటన్నింటిలో నూతన పాలకవర్గాలు, సభ్యులతో మొదటి భేటీలను నిర్వహిస్తారు.
* చిట్ నిమిత్తం వినియోగదారు చెల్లించిన మొత్తం రూ.29 వేలను 12 శాతం వడ్డీతో సహా వాపసు ఇవ్వాలని, పరిహారంగా రూ.5 వేలు, ఖర్చుల కింద రూ.వెయ్యి చెల్లించాలంటూ సంగారెడ్డిలోని ఆస్కార్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.
* జాడ తెలియని పిల్లలను వెతికి పట్టుకునేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమానికి రాష్ట్ర పోలీసుశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏటా జులై 1 నుంచి నెలరోజులపాటు కొనసాగే దీన్ని ఇప్పటివరకు 4దఫాలుగా నిర్వహించారు.
* రవిప్రకాశ్ నుంచి టీవీ9 వాటాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ సైబరాబాద్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ సినీహీరో శివాజీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది.
* సచివాలయంలోని భవనాలను కూల్చివేస్తే, విద్యాశాఖ కార్యాలయాన్ని ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) ప్రాంగణంలోకి మార్చాలని అధికారులు యోచిస్తున్నారు.
* ఈ నెల 22, 23వ తేదీల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు అఖిల భారత జవహర్ నవోదయ విద్యాలయ అలుమ్ని అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ఇన్ఛార్జి ప్రదీప్కుమార్రెడ్డి తెలిపారు.
* మహిళలను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి సంఘం అధ్యక్షురాలు డీవీవీ శ్రీలక్ష్మివాణి కోరారు. సంఘ ప్రతినిధులతో ఆమె బుధవారం దిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్దాస్, హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డిలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
* తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 (1) ప్రకారం ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు అందులో పేర్కొంది.
* గోదావరి జలాల వినియోగం, నీటి వివాదాలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య ఈ నెల 27న చర్చలు జరగనున్నట్లు తెలిసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఈ సమావేశం జరుగుతుందా లేదంటే అధికారులు మాత్రమేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
* రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రిని అభినందించేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, అభిమానులు తరలివచ్చారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు పాసులు మూడు సంవత్సరాలకు ఒకసారి తీసుకునేలా మొదటి ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామన్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కొత్త వాహనాలు కొనుగోలు సమయంలో డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈనెల 13 నుంచి ఫిట్‌నెస్ లేని 624 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటిదాకా 357 బస్సులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ చేయించని వాహనాల వివరాలు ప్రజల ముందు ఉంచుతామని వివరించారు.
దిగొచ్చిన ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్-విచారణకు సిద్ధం-తాజావార్తలు–06/20
Related tags :