హాంగ్ కాంగ్ లో ప్రవాస తెలుగు వారందరు ఎంతో ఆనందోత్సాహాలతో దీపావళి వెలుగులను తమ నవ్వుల జిలుగులతో వెలిగించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారు స్థానిక కోవిడ్ నియమాలను పాటిస్తూ ఘనంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇండియా క్లబ్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మన తెలుగు సంస్కృతిని ప్రదార్శిస్తూ, పిల్లలు – పెద్దలు తమ నాట్య గానాలతో అందరిని అలరించారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ సమాజ సేవిక శ్రీమతి షీలా సమతాని మరియు మిస్ కోని వాంగ్,-అల్పసంఖ్యాక వర్గాలకున్న, మద్దతు సేవా కేంద్రానికి అధ్యక్షురాలిగా, హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలకు తమ సంస్థల ద్వారా అనేక సేవలను అందజేస్తున్నారు.
ముఖ్య అతిధులిద్దరు తెలుగు వారి సంప్రదాయాలని, వేడుకల్ని, సేవా భావాన్ని, స్ఫూర్తిగా కొనియాడుతూ ప్రశంసించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ, తాము ప్రస్తుతం హైదరాబాద్ లో వున్నా, తమ కార్యవర్గ సభ్యులు శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి రాధిక విశ్వనాథ్, శ్రీమతి కొండ మాధురి, శ్రీమతి హర్షిణి పచ్చoటి, శ్రీ రాజశేఖర్ మన్నే, శ్రీ వేమూరి విశ్వనాథ్, శ్రీ హరీన్ తుమ్మల, శ్రీ గరదాస్ గ్యానేశ్వర్ తదితరులు ఎంతో నేర్పుగా దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని తమ ఆనందాన్ని వెల్లడించారు.