NRI-NRT

లండన్‌ కోర్ట్… నీరవ్ మోదీకి బిగ్ షాక్

లండన్‌ కోర్ట్… నీరవ్ మోదీకి  బిగ్ షాక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (PNB) రూ.11 వేల కోట్ల మేర మోసగించి, యూకేలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) అప్పగింతకు మార్గం సుగుమమైంది. భారత్‌కు అప్పగింత ఆదేశాలను సవాలు చేస్తూ గతంలో అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను యూకే న్యాయస్థానం (UK Court) బుధవారం తోసిపుచ్చింది. దీంతో నీరవ్ మోదీని భారత్‌ తీసుకొచ్చేందుకు లైన్‌క్లియర్ అయ్యింది. దీంతో ఎట్టకేలకు భారత దర్యాప్తు ఏజెన్సీల కృషి ఫలించినట్టయ్యింది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మోసం కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వేల కోట్ల రూపాయల మోసం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.