గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు కాట్రగడ్డ అరుణా మిల్లర్. డెమొక్రాట్ల తరఫున తలపడి… రిపబ్లికన్ల కంచుకోటలో పాగా వేశారు ఈ తెలుగు మహిళ. ఉన్నత లక్ష్యాలను కలగనడం, వాటిని నిజం చేసుకోడానికి పోరాడడం… ఇదీ క్లుప్తంగా అరుణ జీవన ప్రయాణం.
గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు కాట్రగడ్డ అరుణా మిల్లర్. డెమొక్రాట్ల తరఫున తలపడి… రిపబ్లికన్ల కంచుకోటలో పాగా వేశారు ఈ తెలుగు మహిళ. ఉన్నత లక్ష్యాలను కలగనడం, వాటిని నిజం చేసుకోడానికి పోరాడడం… ఇదీ క్లుప్తంగా అరుణ జీవన ప్రయాణం.
***అరుణ పుట్టిన ఊరు కృష్ణా జిల్లాలోని వెంట్రప్రగడ. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు మెకానికల్ ఇంజనీర్. ఆయన 1960ల్లో… అవకాశాలను వెతుక్కుంటూ అమెరికా వెళ్ళారు. అక్కడ కాస్త స్థిరపడ్డాక… 1972లో… కుటుంబాన్ని అమెరికా తీసుకువెళ్ళారు. అప్పటి నుంచీ అదే తన స్వదేశమైపోయిందంటారు అరుణ. ‘‘చాలామందిలాగే మా నాన్న కూడా తన కలలను నిజం చేసుకోడానికి… భార్యనూ, ముగ్గురు పిల్లలనూ, బంధు మిత్రులనూ వదిలేసి అమెరికా వచ్చారు. తన లక్ష్యం కోసం అన్నిటినీ త్యాగం చెయ్యడానికి ఆయన సిద్ధపడ్డారు. ఎందుకంటే ఆయన కలలు సాకారమయ్యే చక్కటి అవకాశాలను అమెరికా అందించింది. కొన్నేళ్ళ తరువాత మేము కూడా అమెరికా వచ్చేశాం. అప్పటికి నా వయసు ఏడేళ్ళు. న్యూయార్క్ ప్రాంతంలో కొంతకాలం ఉన్నాం. తరువాత మిస్సోరీలోని సెయింట్ లూయీ్‌సకు వచ్చాం. నేను మిడ్‌వె్‌స్టలో పెరిగాను. అక్కడే నేనూ, నా సహోదరులు చదువుకున్నాం. దీక్షగా చదవడం, అంకితభావంతో శ్రమపడడం ఎంత ముఖ్యమో మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. మన కలలను నిజం చేసుకోడానికి అమెరికాకన్నా గొప్ప ప్రదేశం ప్రపంచంలోనే లేదనే భావన ఆ విధంగా నా మనసులో స్థిరపడిపోయింది’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
**సమస్యలతో మమేకం…
అరుణ మిస్సోరీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ట్రాన్స్‌పోర్ట్ ఇంజనీర్‌గా… ప్రభుత్వోద్యోగంలో చేరారు. వర్జీనియా, హవాయ్, క్యాలిఫోర్నియా ప్రాంతాల్లో పని చేశారు. కాలేజీ రోజుల నుంచి మంచి స్నేహితుడైన డేవిడ్ మిల్లర్‌ను పెళ్ళి చేసుకున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే… మరోవైపు స్థానిక సమస్యల పరిష్కారం కోసమూ ఆమె పాటుపడేవారు. మహిళల హక్కులు, పిల్లల భధ్రత, పర్యావరణ పరిరక్షణ, సురక్షితమైన రవాణా లాంటి అనేక అంశాలపై… వివిధ సామాజిక, సాంస్కృతిక సంస్థలతో కలిసి పని చేస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయాలపై కూడా ఆమెకు స్పష్టమైన దృక్పథం ఉంది. ప్రజలకు సేవ చెయ్యాలంటే అంతకన్నా మంచి మార్గం లేదు అంటారామె. అందుకే… రాజకీయంగా అత్యున్నత పదవులకు చేరేందుకు కృషి కొనసాగించారు. 2000లో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది. అదే ఏడాది తొలిసారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2010 నుంచి దాదాపు ఎనిమిదేళ్ళపాటు ‘హౌస్ ఆఫ్ డెలిగేట్స్’లో మేరీల్యాండ్‌లోని డిస్ట్రిక్ట్-15తరఫున ప్రతినిధిగా ఉన్నారు. ఈ సందర్భంగా వివిధ చట్టాల రూపకల్పనకూ, ఆమోదానికీ ఆమె పాటుపడ్డారు. 2012-2020 మధ్య అనేక కమిటీలకూ, కమిషన్లకూ వివిధ హోదాల్లో పని చేశారు. 2018లో మేరీల్యాండ్ 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో పోటీ చేసినా… రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై… అమెరికా వలస ప్రజల్లో.. ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు.
*దేశ రాజధానికి పక్కనే ఉన్న, రిపబ్లికన్లకు మంచి పట్టున్న ఆ స్థానంలో గెలుపుకోసం ఆమె గట్టిగానే పోరాడారు. కాగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్లు సైతం ఆమెకు అనుకూలంగా పని చేశారు. అయితే, విరాళాల సేకరణ కోసం నిర్వహించిన ఒక కార్యక్రమంలో… అరుణను హిందూ జాతీయవాద సిద్ధాంతాలున్న వ్యక్తులు సత్కరించారనీ, వారి ద్వారా అరుణ లబ్ధి పొందారనీ వార్తలు వచ్చాయి. దీన్ని వివాదం చెయ్యడానికి ప్రత్యర్థులు ప్రయత్నించారు. దీన్ని అరుణ ఖండిస్తూ… హిందుత్వ మద్దతుదార్ల నుంచి ఒక్క డాలరైనా తీసుకోలేదనీ, ముస్లిం వర్గాలకు, మత స్వేచ్ఛకూ మద్దతుగా నిలిచిన చరిత్ర తమకు ఉందనీ స్పష్టం చేశారు.
**విధానాలు మార్చాలి…
అమెరికన్ రాష్ట్రాల్లో గవర్నర్ తరువాత అత్యున్నత పదవి… లెఫ్ట్‌నెంట్ గవర్నర్. గవర్నర్ ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు విధులను లెఫ్ట్‌నెంట్ గవర్నరు నిర్వర్తిస్తారు. అలాగే గవర్నర్ రాజీనామా చేసినా, పదవి నుంచి తొలగింపునకు గురైనా, మరణించినా… ఆ పదవిని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చేపడతారు. ‘‘నేను దాదాపు ఇరవయ్యేళ్ళ నుంచి ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాను. నా కుటుంబం ఇక్కడే విస్తరించింది. నా పిల్లలు ఇక్కడి పబ్లిక్ స్కూళ్ళలోనే చదివారు. ఈ ప్రాంతంలో సమస్యలూ, ప్రజల సాధకబాధకాలూ నాకు బాగా తెలుసు. అలాగే నా కెరీర్‌లో ఎక్కువకాలం ప్రభుత్వోద్యోగిగా ఇక్కడే పని చేశాను. నేను ఉద్యోగిని అయిన తల్లిని. పిల్లల పెంపకం, వయోధికులైన తల్లితండ్రుల సంరక్షణ… వాటితో వృత్తి బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకోవడం నాకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ నివసిస్తున్న సగటు ప్రజలకు నేను భిన్నమైనదాన్ని కాదు. అటువంటి ప్రజలకు అనుకూలంగా ఉండే విధానాలను ప్రవేశపెట్టి, అమలు చేయడానికి నా అధికార హోదాను వినియోగించుకుంటాను. అలాగే ఈ ప్రాంతంలో ఉద్యోగం, మౌలిక సదుపాయాలు, పౌర రవాణా, ట్రాఫిక్ లాంటి వివిధ సమస్యలు ఉన్నాయి.
check valid json
**వాటన్నిటిమీదా నాకు అవగాహన ఉంది’’ అని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు అరుణ. ఆమెకు మీనా, ఛోలే, సాషా అనే ముగ్గురు అమ్మాయిలు. ‘‘పిల్లల సంరక్షణ, ఉద్యోగ బాధ్యతలు… అటు వృత్తినీ, ఇటు ఇంటినీ నిర్వహించుకుంటూ రావడం పెద్ద సవాలు. ఆ కష్టమేమిటో నాకు తెలుసు. ఈ విషయంలో నా కుటుంబం నుంచి నాకు గట్టి మద్దతు దొరికింది. ఇంట్లో ఒక పురుషుడు మాత్రమే ఉద్యోగం చేసే తరం కాదు మనది. ఇరవయ్యొకటో శతాబ్దంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే కానీ గడవని పరిస్థితి. కార్మిక విధానాలను దీనికి అనుగుణంగా మార్చాలి. తల్లితండ్రులు ఇద్దరికీ జీతంతో కూడిన పేరెంటల్ లీవ్ ఇవ్వాలి, పిల్లలకు అత్యుత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలి. అలాగే నాణ్యమైన విద్య వారికి లభించేందుకు చర్యలు తీసుకోవాలి. వీటికే నా ప్రాధాన్యం’’ అని చెబుతారామె. ‘‘ఈ దేశం నాకు అనేక అవకాశాలు ఇచ్చింది. తిరిగి ఇవ్వడానికి ప్రజా సేవకన్నా గొప్ప మార్గమేదీ కనిపించలేదు. నాకన్నా ముందు ఈ దేశానికి వచ్చిన ఎందరో వ్యక్తులు ప్రజాస్వామ్యం కోసం, అందరికీ సమాన హక్కుల కోసం పోరాటం చేశారు. వారికి నా ధన్యవాదాలు. అమెరికాలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి నిరంతరం ఉత్తేజం పొందుతూనే ఉన్నాను’’ అంటున్న అరుణ… ‘‘ప్రతి ఒక్కరికీ ప్రతిఫలాలు అందడానికి అవిశ్రాంతంగా పోరాటం చేస్తాను. ఏ ఒక్కరూ వెనుకబాటుతనంతో లేని ప్రదేశంగా మేరీల్యాండ్‌ను రూపుదిద్దాలనే ఒక అంకితభావంతో ఆ ప్రమాణం మొదలవుతుంది’’ అని తన గెలుపు అనంతరం స్పష్టం చేశారు. అలాంటి అరుణోదయాన్నే మేరీల్యాండ్ కోరుకుంటున్నట్టు ఆమె విజయం స్పష్టం చేస్తోంది.
*మహిళల హక్కులు, పిల్లల భధ్రత, పర్యావరణ పరిరక్షణ, సురక్షితమైన రవాణా లాంటి అనేక అంశాలపై… వివిధ సామాజిక, సాంస్కృతిక సంస్థలతో కలిసి పని చేస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయాలపై కూడా ఆమెకు స్పష్టమైన దృక్పథం ఉంది. ప్రజలకు సేవ చెయ్యాలంటే అంతకన్నా మంచి మార్గం లేదు అంటారామె.