‘‘అదృష్టం కొద్దీ చిత్రసీమలో అడుగుపెట్టాను. ఎన్ని సినిమాలు చేస్తానో, ఎంత కాలం ఉంటానో తెలీదు. అందుకే ప్రతి సినిమానీ ఆస్వాదిస్తూ పనిచేయాలని నిర్ణయించుకున్నాను’’ అంటోంది అనుపమ పరమేశ్వరన్. సహజ సిద్ధమైన నటనకు అందం తోడైన కథానాయిక అనుపమ. కథానాయికల జాబితాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. తెలుగమ్మాయి కాకపోయినా భాషపై ప్రేమతో, సినిమాపై మక్కువతో తెలుగు నేర్చుకుని, తెలుగులోనే మాట్లాడుతోంది. సెట్లో మీరెలా ఉంటారు? సన్నివేశానికి ముందు చేసే కసరత్తులేంటి? అని అడిగితే.. ‘‘సెట్లో అడుగుపెట్టేటప్పుడు నా దృష్టంతా నేను చేయబోయే సన్నివేశంపైనే ఉంటుంది. స్క్రిప్టు పట్టుకుని ఓ పక్కకు వెళ్లిపోతాను. ఒక్కో డైలాగ్ని వేర్వేరు పద్ధతుల్లో ప్రాక్టీస్ చేస్తూ చదివేస్తుంటాను. ‘పరీక్షల ముందు కూడా ఇలానే చదివితే నీకు పెద్ద ఉద్యోగం వచ్చేది’ అని అమ్మ నన్ను ఆట పట్టిస్తుంటుంది. సెట్లో తడబడకూడదన్న తపన నాది. నా వల్ల చిన్న తప్పు కూడా జరక్కూడదు. చిన్న చిన్న కసరత్తులు చేయకపోతే మనం చేసే పనికి న్యాయం చేయలేం’’ అంది అనుపమ.
పరీక్షల కోసం కూడా చదివుంటే…
Related tags :