ScienceAndTech

తిండి లేని స్థితి నుంచి.. అమెరికాలోశాస్త్రవేత్తగా

తిండి లేని స్థితి నుంచి.. అమెరికాలోశాస్త్రవేత్తగా

పట్టుదల, కష్టపడేతత్వం ఉండే ఏమైనా సాధించొచ్చు అంటారు. ఇందుకు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన భాస్కర్‌ హలామి జీవితమే చక్కని ఉదాహరణ. తినేందుకు సరిగా తిండి లేని పరిస్థితుల నుంచి అమెరికాలో ఓ సీనియర్‌ శాస్త్రవేత్తగా ఎదిగిన భాస్కర్‌ జీవితం ఆదర్శనీయం. గడ్చిరోలి జిల్లా చిర్చాడీ అనే చిన్న గ్రామంలోని ఓ గిరిజన కుటుంబంలో భాస్కర్‌ జన్మించారు. గ్రామంలో సైన్స్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తిచేసిన తొలివ్యక్తి భాస్కరే. ప్రస్తుతం ఆయన అమెరికా మేరీల్యాండ్‌లోని బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లో సీనియర్‌ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. చిన్నతనంలో పడ్డ కష్టాలు, తిండి లేని రోజులను గుర్తుచేసుకొన్న హలామి.. కొన్ని నెలల పాటు మహువా పూలు వండుకొని తిని ఆకలి తీర్చుకొనే వాళ్లమని పేర్కొన్నారు.