*అనంతపురం: జిల్లాలోని బొమ్మనహాల్ మండలం ఉంతకల్లులో పోలీసులు భారీగా మోహరించారు.కణేకల్లు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపులతో ఓ మైనార్టీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం బళ్లారికి తరలించారు. కాగా… బళ్లారిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతూ తల్లి షేకున్ బీ, కుమారుడు మన్సూర్ భాషా మృతి చెందగా.. తండ్రి సలీం భాషా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ బందోబస్తు నడుమ బళ్లారి నుంచి ఉంతకల్లుకు తల్లి, కుమారుడి మృతదేహాలను తరలించారు. అంత్యక్రియలు త్వరగా నిర్వహించాలంటూ మన్సూర్ భాషా కుటుంబంపై పోలీసులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. కనేకల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి కొట్టడం, బెదిరింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ బంధువులు ఆవేదన చెందుతున్నారు.
*పోడు భూముల సర్వే లో పలు అవకతవకలు కు పాల్పడి తనను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన చండ్రుగొండ మండలం రవికంపాడు గ్రామ నివాసి బానోత్ బాలు 45 సం సన్నాఫ్ చిన్న బద్రు రవికంపాడు పంచాయతీ సెక్రెటరీ కిరణ్ కుమార్ తో గొడవ పెట్టుకుని మంగళవారం(15.11.2022)సాయంత్రం రవికంపాడు పంచాయతీ ఆఫీస్ ఎదుట బానోత్ బాలు పురుగుమందు తాగడంజరిగినది ఇది గమనించిన బానోత్ రాంజీ అతనిని ఆటోలో చండ్రుగొండ ప్రభుత్వ వైద్యశాల కు తరలించడం జరిగినది కేసు సీరియస్ దృష్ట్యా ప్రాథమిక వైద్యం చేసిన వైద్య బృందం వెంటనే 104 లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించడం జరిగినది పూర్తి వివరాలు సేకరించవలసి ఉంది
*పులివెందుల తాసిల్దార్ కార్యాలయంలో రాగిపాటి పెద్ద మస్తాన్ అనే వ్యక్తి పులివెందుల పట్టణ వీఆర్వో కృష్ణ మోహన్ రావు ను కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నగరగుట్ట ప్రాంతంలో భూమికి సంబంధించి రాగిపాటి మస్తాన్ బుధవారం తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తన భూమి సంబంధించి ఆన్లైన్లోకించాలని విఆర్ఓ ను అడగడంతో దీనికి సంబంధించి భూమి కోర్టులో ఉందని చెప్పడంతో వీఆర్వో కృష్ణ మోహన్ రావు పై తన దగ్గర ఉన్న కత్తితో వెనకవైపున పొడిచాడు. అక్కడే ఉన్న సహ ఉద్యోగులు వెంటనే కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు, చికిత్స కోసం వీఆర్వో ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విఆర్ఓ మాట్లాడుతూ 2008 నుంచి ఈ వ్యక్తి భూమి కోసం తిరుగుతూ ఉన్నాడని భూమికి సంబంధించి కోర్టు కేసులో ఉందని గతంలో ఇతని పేరు మీద కాగితాలు అయితే ఉండేవని 2008లో భూసేకరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగిందని అతనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆన్లైన్ లో ఎక్కించాలని వస్తూ ఉంటారని. ఈ విషయంపైనే మళ్లీ ఈరోజు కూడా ఎమ్మార్వో కలయానికి రావడం జరిగిందని నా దగ్గరకు వచ్చి ఈ భూమి సంబంధించి మళ్లీ అడిగాడని నేను ఇది కోర్టులో కేసులో ఉందని చెప్పానని కానీ అతను కత్తి తీసుకొని నా వీపున పొడిచాడని తెలిపారు. తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది అందరూ వీఆర్వో కృష్ణమోహన్ ను పరామర్శించారు. అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చి దాడి చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సంఘటనపై విఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
*తమ ఇష్టాన్ని కాదని కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కన్నకూతురు అన్న విషయాన్ని కూడా మరిచి ఆమెకు కోలుకోలేని గాయాన్ని చేశారు. ఆమె మనస్సు ముక్కలయ్యేలా ప్రవర్తించారు. అత్తవారింటి నుంచి కూతురిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లడమే కాకుండా.. ఆపై పైశాచికంగా ప్రవర్తించి కూతురికి శిరోముండనం చేశారు. ఆమె మనసును మార్చేందుకు శతవిథాలా ప్రయత్నించారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు వదిలి పెట్టారు. అత్తింటి వారి ఇంటి నుంచి యువతిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేసి శిరోమండనం చేసిన వైనం జగిత్యాల జిల్లాలోని ఇటిక్యాలలో వెలుగుచూసింది. తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కట్టుకున్నోడు కావాలంటూ యువతి స్టేషన్ మెట్లు ఎక్కింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.
*అమరావతి భూముల కొనుగోలుపై సిట్ ఏర్పాటుపై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఆలపాటి రాజా, వర్ల రామయ్య తదితరులు హైకోర్టులో సవాలు చేశారు. సిట్ ఏర్పాటుపై స్టే విధిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 15న హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. న్యాయమూర్తులు ఎంఆర్షా, ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ ప్రారంభమైంది.
* పేదలకు అందవలసిన రేషన్ బియ్యం పక్కదారిన పడుతుంది. కొందరు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సంగా రెడ్డి జిల్లా కోహీర్ రైల్వే గేటు సమీపంలో బుధవారం అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.
*సంగారెడ్డి: జిల్లాలోని అమీన్పూర్ కేఎస్ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం కలకలం రేపుతోంది. ఆన్లైన్ ద్వారా రూ.10 లక్షలు ఇన్వస్ట్మెంట్ చేసి సాయిపవన్ నష్టపోయాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి మందలించడంతో ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.