Movies

మేం చేసేది చాలా తక్కువ!

మేం చేసేది చాలా తక్కువ!

సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో సింహభాగం తారలకే దక్కుతుంటుంది. కథాబలంతో పాటు నటీనటుల స్టార్‌డమ్‌ మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇతర విభాగాల వారికి అంతగా ప్రాధాన్యం దక్కదనే విమర్శలు వినిపిస్తుంటాయి. తాజాగా ఈ విషయంలో నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకచోప్రా. సినిమా విషయంలో నటీనటులు పడే కష్టం ఏమంత పెద్దది కాదని, అందరి ప్రతిభను ఉపయోగించుకొని తారలు రాణిస్తుంటారని వ్యాఖ్యానించింది.ఫిల్మ్‌ మేకింగ్‌లో తమ పాత్ర చాలా స్వల్పమని స్పష్టం చేసింది. ఇటీవల ఇండియా టూర్‌ ముగించుకొని అమెరికా చేరుకున్న ప్రియాంక చోప్రా అక్కడ మీడియాతో ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ ‘నటులకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ క్రెడిట్‌ ఇస్తుంటారు. ఎవరో రాసిన కథలో మేం నటిస్తుంటాం. సంభాషణలు కూడా ఎవరో రాస్తారు. డ్యాన్స్‌ను కొరియోగ్రాఫర్‌ కంపోజ్‌ చేస్తారు. డబ్బింగ్‌ మొదలుకొని మేం వేసుకునే కాస్ట్యూమ్స్‌ , మేకప్‌ విషయంలో కూడా మా సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు. సినిమా సక్సెస్‌ అయితే మాత్రం మమ్మల్ని మాత్రమే పొగడ్తలతో ముంచెత్తుతారు. మిగతా అందరి శ్రమను విస్మరిస్తారు’ అని చెప్పింది. గత ఏడాది ఈ భామ హాలీవుడ్‌ చిత్రం ‘ది మ్యాట్రిక్స్‌ రీసరెక్షన్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది