నాటి సంఘటన తలుచుకుంటేనే దివిసీమ ప్రజలకు ఉలిక్కిపాటు . 1977 నవంబరు 19న సంభవించిన ఉప్పెన దివిసీమ లో 30 వేల మందిని పొట్టన పెట్టుకుంది. ఆ ఘోర కలికి నేటితో 45 ఏళ్లు నిండిపోయి. అయినప్పటికీ దివి వాసుల గుండెల్లో నేటికీ ఆ రోజును తలచుకుంటే వణుకు పుడుతుంది. దివిసీమ ఉప్పెన కంటే ముందే ప్రతి వందే ళ్లకోసారి కృష్ణ తీరప్రాంతాన్ని ఉప్పెనలు ముంచెత్తాయి.
గడచిన నాలుగు శతాబ్దాలలో నాలుగు పర్యాయాలుగా సంభవించిన ఉప్పెనలు దాదాపుగా లక్ష మందిని పొట్టన పెట్టుకున్నాయి .
శతాబ్దాలుగా జలప్రళయాలకు నిలయం కృష్ణాతీరం కానవస్తుంది.
1977 నవంబర్ 19న దివిసీమ ను జల ప్రళయం కాటేసిన రోజు. ఆ రోజు ఉదయం నుంచే మొదలైన వర్షం దివిసీమ ను తడిపి ముద్ద చేసింది. రాత్రికి తీవ్రరూపం దాల్చి ఉప్పెనలా తీరప్రాంతం పైదండెత్తింది .దాదాపు తాటి చెట్టు ఎత్తున ఎగసిపడిన సముద్రపు అలలు దివిసీమ లోని సముద్ర తీర ప్రాంత గ్రామాలను మింగేశాయి. ఈ ఘోర విపత్తు లో పదివేల మంది జలసమాధి అయ్యారు .అప్పట్లో కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా లేకపోవడంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రభుత్వ యంత్రాంగం ముందుగా కనిపెట్టలేకపోయింది . దీంతో ఊహించని నష్టం జరిగింది .ప్రాణ నష్టంతో పాటు ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. ఆ విపత్తు నుంచి కోలుకోవడానికి ఎంతో కాలం ఎదురు చూడవలసి వచ్చింది.
ఈ విపత్తు చేసిన గాయం నేటికీ వెంటాడుతూనే ఉంది. ప్రతి నవంబర్ 19న ప్రపంచం ఈ విపత్తు ను గుర్తు చేసుకుంటూనే ఉంది .
ఈ ఉప్పెన అప్పటి దివి తాలూకాను అతలాకుతలం చేసింది. దివిసీమ ను వణికించిన విపత్తే మొదటిది కాదు .నాలుగు శతాబ్దాలుగా వందేళ్లకోసారి సముద్రం ఉప్పొంగడం తీరప్రాంత వాసులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.1600 శతాబ్దం నుంచి 1900 శతాబ్దం వరకు ఈ మధ్యకాలంలో నాలుగు ఉప్పెనలు కృష్ణా తీరంలో సంభవించాయి .ఈ ఘోర విపత్తు లలో దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు పెద్ద పెద్ద విపత్తు లతో పాటు తరచూ సంభవించే తుఫాన్లు ఈ ప్రాంత వాసులను ఎన్నో కష్ట నష్టాలకు గురిచేశాయి. విపత్తు ల నమోదు లో భాగంగా దొరికిన సమాచారం మేరకు 1678 లో వచ్చిన ఉప్పెనకు బందరు పట్టణం లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు .తదుపరి 1779 అక్టోబర్ 13 న సంభవించిన ఉప్పెన తో బందరు ప్రజలకు భారీ నష్టం వాటిల్లింది
ఈ ఉప్పెన లో 12 అడుగుల ఎత్తున సముద్ర అలలు ఎగిసి పడ్డాయి .బందరు ను ఉప్పెన ముంచెత్తగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేలకు పైబడి ఉంది ఇదిలావుంటే దివిసీమ కంటే ఓ శతాబ్దం ముందు బందరులో ఘోర విపత్తును ప్రజలు చవిచూశారు. 1864 నవంబర్ ఒకటో తేదీన ఈ విపత్తు సంభవించింది ఆ రోజు దీపావళి అమావాస్య పండుగ రోజు కాగా మధ్యాహ్నం నుంచి చిన్న చిన్న చినుకులతో మొదలైన వాన గంట గంటకు పెరుగుతూ కుండపోతగా మారింది అప్పట్లో పట్టపగలే బందరులో చిమ్మచీకట్లు లుముకున్నాయి.
రాత్రి పది గంటల తర్వాత సముద్రం ఉగ్రరూపం దాల్చింది 13 అడుగుల ఎత్తున సముద్రపు అలలు కరాళనృత్యం చేశాయి. ఈ విపత్తు లో ఒక బందరులోనే 30 వేల మందికి పైగా అసువులు బాశారు. ఈ విధంగా శతాబ్దానికోసారి ఆగ్రహిస్తున్న సముద్రం కృష్ణా తీరం పై కోరలు చాస్తోంది .ఈ విధంగా శతాబ్దాలుగా జల ప్రళయాలకు నిలయంగా కృష్ణాతీరం కానవస్తుంది. మరో ఉపద్రవానికి తీర ప్రాంతం దగ్గర పడుతుందనే భయం ఇక్కడి ప్రజలను వెంటాడుతూనే వుంది.
1977 నవంబర్ 19 దివిసీమ ఉప్పెనలో దాదాపు 14 వేలమంది అధికారికంగా ప్రాణాలు కోల్పోగా అనధికారంగా 50 వేలకు పైగా చనిపోయారు. లక్షల్లో మూగజీవాలు మృతి చెందాయి ఎటు చూసినా శవాలు గుట్టలు నామరూపాలు లేకుండా పోయిన ఇల్లు తమ వారు ఎక్కడున్నారు ఏమైపోయారు తెలియక గుండెలు అలిసేలా ప్రజల ఆర్తనాదాలు. బిక్కు బిక్కుమంటూ కాలరాత్రిలో ఎటు వెళ్తున్నాము తెలియక పొట్ట చేత పట్టుకుని గడిపిన క్షణాలు తలుచుకుంటేనే ఇప్పటికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.నాటి ఉప్పెన తర్వాత ఆ ప్రాంతం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ఉప్పెన దాటికి గ్రామాలు అన్ని తుడిచిపెట్టుకుని పోవడంతో నిరాశయులైన ప్రజలకు సాయం అందించడానికి దేశం మొత్తం కదలి వచ్చింది. ఇప్పటికీ అక్కడ ప్రజలు దివిసీమ ఉప్పెన గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 19 న చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ గ్రామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించుకుంటారు.
దివిసీమ ఉప్పెనలో 50 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో
ఉప్పెన దాటికి భయభ్రాంతులకు గురై ఎవరికివారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చుంటే ప్రాణాలకు తెగించి కొల్లాటి ఆదిశేష రావు సొర్లగొంది గ్రామంలో 50 మందిని దగ్గర్లో ఉన్న రామాలయంలోకి చేర్చాడు. మిగతా వారిని తీసుకొద్దాం అని బయలుదేరేసరికి వాగు ముంచేయడంతో రామాలయం గుడి కిటికీ పట్టుకొని వేలాడుతూ తన ప్రాణాలు కాపాడుకోవడమే కాక ఆ గ్రామంలో మరో 50 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో కొల్లాటి ఆదిశేష రావు