తిరుమల 7 కొండలు..పరమార్ధం – TNI ఆధ్యాత్మిక వార్తలు
1. నీలాద్రి2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.
ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.
1. వృషభాద్రి – అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే – శబ్దం
శబ్దం అంటే – వేదం
వేదం అంటే – ప్రమాణము
నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.
2. నీలాద్రి – అంటే ధర్మం
ధర్మం అంటే – నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.
అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.
3. గరుడాద్రి – అంటే పక్షి – ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.
షడ్ – అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది.
ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.
భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.
అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.
4. అంజనాద్రి – అంజనం అంటే కంటికి కాటుక.కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.కంటికి అందం ఎప్పుడు? – ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.అప్పుడు అంజనాద్రి దాటతాడు.
5. శేషాద్రి – ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,
తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)
తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.
6. వేంకటాద్రి – వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.
7. నారాయణాద్రి – అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం 7 కొండలు ఎక్కడం
1. టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. తిరుపతిలోని టీడీడీ పరిపాలనా భవన మైదానంలో జరిగిన ఈ ఉత్సవంలో పెద్దఎత్తున మహిళలు, దంపతులు పాల్గొని సామూహిక దీపారాధన చేశారు. శ్రీవారి ఆలయ అర్చకులు భక్తులతో తొమ్మిది సార్లు దీపమంత్రం పలికిస్తూ సామూహిక లక్ష్మీనీరాజనం సమర్పించారు.
2. భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా స్వామి వారికి జనవరి రెండో తేదీల్లో నిర్వహించే తెప్పోత్సవం, ముక్కోటి రోజున ఉత్తర ద్వారదర్శనాలకు చేపట్టనున్న ఏర్పాట్లపై ముందస్తు కసరత్తు చేపట్టనున్నారు. రూ.1.25కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేయగా ఇందులో రూ.60లక్షలు దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనులకు కేటాయించనున్నారు. ఇందుకు సంబందించి 16 పనులకు టెండర్ల ప్రక్రియను కూడా నిర్వహించారు. కాగా పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రెండేళ్ల తరువాత భక్తులు ఉత్తరద్వారంలో ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం లభించనుండటంతో ఈసారి భక్తులు అధికసంఖ్యలో తరలొచ్చే అవకాశాలున్నాయి. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.ఎందుకంటే ఈ ఏడాది నవంబరులోనే చలితీవ్రత అధికంగా ఉండటం, జనవరి నాటికి ఇంకా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ర్టాలతో పాటు సరిహద్దున ఉన్న ఛత్తీ్‌సగఢ్, ఒడిస్సా నుంచి తరలివచ్చే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. కానీ ఏటా సమీక్షలు నిర్వహిస్తున్నారు తప్ప సమస్యలకు పరిష్కారం లభించటంలేదన్న విమర్శలున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ముక్కోటికి వచ్చే భక్తులు వసతి దొరక్క కరకట్ట, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో చలికి గజగజ వణుకుతూ తలదాచుకుంటున్నారు. ఇక ఉత్తరద్వార దర్శన సమయంలో వీవీఐపీ, వీఐపీలకు కేటాయించే టిక్కెట్లలో చాలావరకు నగదు దేవస్థానం ఖాతాకు జమకావటం లేదని సమాచారం. ఈతంతు ఏటా జరుగుతుండటంతో దేవస్థానం ఆదాయానికి గండి పడుతోందని దేవస్థానం వర్గాలు వాపోతున్నాయి. ఆడిట్ చేసే అధికారులు సైతం అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు. ఉత్తరద్వార దర్శనం వీవీఐపీ, వీఐపీ టిక్కెట్లకు సంబంధించిన నగదు దేవస్థానం ఖజానాకు జమవడం లేదా అన్న దీనిపై దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక రాయాల్సి ఉంటుందని దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈసారి నిర్వహించే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్న తరుణంలో అందుకు అనుగుణంగా రక్షేత స్థాయిలో భక్తులు మెచ్చేరీతిలో మౌలిక సదుపాయాలుండాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. అయితే శనివారం కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన కొత్తగూడెంలోని కలెక్టరేట్‌లో ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష జరగనుండగా.. ఎస్పీ డాక్టర్ వినీత, భ ద్రాచలం ఆర్డీవో రత్న కల్యాణి, దేవస్థానం ఈవో బి.శివాజీతో పాటు పలుశాఖలు, విభాగాల అధికారులు హాజరుకానున్నారు.
3. యాదగిరిగుట్టలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణ వేడుకల్లో భాగంగా ఉదయం గజవాహన సేవను ఆల య తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం అష్టభుజి ప్రాకారమండపంలో కల్యాణ వేడుకలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.39,79,146 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, యాదగిరిక్షేత్రంలో మిగిలిన పనులు పూర్తిచేసి భక్తులకు మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు కృషి చేయాలని సీ ఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్వామి ని దర్శించుకున్న అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆలయ విస్తరణ పనులపై సమీక్షించారు.
4. రికార్డు స్థాయిలో షిర్డీ సాయిబాబా ఆదాయం
ఏపీలోని తిరుమల తర్వాత దేశంలో హుండీ ఆదాయం అధికంగా ఉన్న ఆలయం మహారాష్ట్రలోని షిర్డీ. కరోనా తరువాత షిర్డీ సాయిబాబాకు రికార్డు స్థాయిలో హుండీ కానుకలు వచ్చి చేరుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ నవంబర్ వరకు బాబా సంస్థాన్కు రూ.398 కోట్ల కానుకలు వచ్చాయని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు. సుమారు మూడు కోట్ల మంది భక్తులు ప్రపంచ దేశాల నుండి వచ్చినట్లు తెలిపారు.
5. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న దేవస్థానానికి అరుదైన ఘనత లభించింది. దేవస్థానానికి సంబంధించిన ఏడు విభాగాల్లో ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. వరుసగా నాలుగో సంవత్సరం చిన వెంకన్న దేవస్థానం ఐఎస్ఓ సర్టిఫికెట్లు అందుకుంది. భారతదేశంలో వరుసగా నాలుగు సార్లు ఐఎస్ఓ సర్టిఫికెట్లు అందుకున్న ఏకైక దేవస్థానంగా ద్వారకాతిరుమల. ఐఎస్ఓ సర్టిఫికెట్లను ఆలయ చైర్మన్ ఎస్. వి సుధాకర్ రావుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శివయ్య అందజేశారు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టం, ఎన్విరాన్మెంట్ సిస్టం, హెల్త్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగాల్లో ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి.
6. పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్ష కుంకుమార్చన
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఆలయంలో లక్ష కుంకుమార్చననను వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం లక్ష కుంకుమార్చన నిర్వహంచారు. గృహస్తులు రూ.1,116 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేశారు. కాగా రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తామని వేదపండితులు తెలిపారు.
7. దయచూపమ్మా.. కనకదుర్గమ్మా !
కనకదుర్గమ్మ దర్శ నానికి భక్తులు కదిలివచ్చారు. అర్జిత సేవల్లో పాల్గొ ని దయచూడవే దుర్గమ్మా అంటూ పూజలు నిర్వ హించారు. కార్తీకమాసం శుక్రవారం, శనివారం నాడు దుర్గగుడి కి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. క్యూలైన్లలో వేచి ఉండి చిరుమందహాసంతో అభయహస్తం చూపుతున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. నిన్న శ్రీచక్రనవావరణార్చన, చండీహోమంలో పాల్గొన్నారు. లింగానికి కీవీలు, అంజూరలతో అలంకరించి సహస్రలింగార్చన చేశారు. వస్త్రాలను సమర్పించకున్నారు. వేదమంత్రా లు, అమ్మవారి నామాలు, మంత్ర పుష్పాలు, హరతు లు ఇలా కొనసాగాయి. ఎటు చూసినా భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. విశేష అభిషేకా ది కార్యక్రమాలను భక్తులు వీక్షించారు.
*నిత్యాన్నదానానికి విరాళాలు
దుర్గగుడిలో నిత్యాన్నదానానికి నగరానికి చెందిన వీఎన్ రాజశేఖర్ కుటుంబ సభ్యులు రూ.1,01,111 విరాళమిచ్చారు. అలాగే చిత్తూరు జిల్లా వెదురుకుప్పానికి చెందిన పేటరెడ్డి ప్రతాప్, గౌరి, దర్శిత్‌రెడ్డి శుక్రవారం ఆలయానికి విచ్చేసి రూ.1,01,116 విరాళం అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం దాతలకు శేషవస్త్రం, ప్రసాదం, ఆశీస్సులు అందచేశారు.