సినిమాల్లో తాము పోషిస్తున్న పాత్రలు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ స్ఫూర్తినిస్తాయని అంటున్నది బాలీవుడ్ సుందరి తారా సుతారియా. ‘అపూర్వ’ సినిమాతో తాను ఈ అనుభూతిని పొందానని ఆమె చెబుతున్నది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో తొలిసారి నాయిక ప్రధాన చిత్రంలో నటిస్తున్నది తారా. ఈ చిత్రంలో టైటిల్ రోల్లో ఆమె కనిపించనుంది. ‘అపూర్వ’ సినిమా గురించి ఈ భామ మాట్లాడుతూ…ఈ చిత్రంలో నాయిక భయమెరుగదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే శక్తియుక్తులున్న యువతి ఆమె. తన దృష్టిలో అసాధ్యమైనదేదీ లేదు. నేను ఇప్పటిదాకా ఇలాంటి క్యారెక్టర్లో నటించలేదు. అపూర్వ చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి.
ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు ఇలా ధైర్యంగా ఉండాలనే స్ఫూర్తి పొందా’ అని చెప్పింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన తారా సుతారియా ‘మార్జవాన్’, ‘తడప్’ వంటి చిత్రాలతో నాయికగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది జాన్ అబ్రహాంతో ‘ఏక్ విలన్’ టైగర్ష్రాఫ్ సరసన ‘హీరోపతి- 2’ సినిమాలతో తెరపై సందడి చేసింది.
అసాధ్యమేదీ కాదు
