తెలుగు తెరపైకి మరో విదేశీ తార అడుగుపెట్టబోతున్నది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఒలీవియా మోరిస్ టాలీవుడ్‌కు పరిచయం కాగా..ఇటీవల శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ చిత్రంతో మరియా ర్యాబోషప్క అరంగేట్రం చేసింది. తాజాగా సత్యదేవ్ కొత్త చిత్రంతో జెన్నిఫర్ పిచినెటో నాయికగా ఎంపికైంది. బ్రెజిలియన్ మోడల్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ సినిమాలో ముఖ్య పాత్రను పోషించింది.సత్యదేవ్ 26వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో డాలీ ధనుంజయ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకంపై బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇందులో ఒక నాయికగా ప్రియ భవానీ శంకర్ ఎంపికవగా…తాజాగా మరో హీరోయిన్గా జెన్నిఫర్‌ను తీసుకున్నారు. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది.
సత్యదేవ్ సినిమాలో బ్రెజిల్ భామ
