ఉండవల్లిలోని ప్రజావేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నాం ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న సీఆర్డీఏ, గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రజావేదికను పరిశీలించారు. ప్రజావేదికను పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వస్తువులను గుర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వస్తువులను తీసుకెళ్లాలని సీఆర్డీఏ అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలకు ఆదేశించారు. ఇకపోతే ఈ ప్రజావేదికలో ఈనెల 24న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుందని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. ప్రజావేదిక తమకు కేటాయించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే తాజాగా ప్రజావేదిక కావాలంటూ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబుకు మరో షాక్-లేఖను చించేసి ప్రజావేదిక స్వాధీనం
Related tags :