‘మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలొస్తాయి. వాటిల్లో ఇదొకటి’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ అనంతరం నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. ‘‘మీరు చూపించే అభిమానం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో ఇదొక అనుభవం. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా. నన్ను మళ్లీ రమ్మని చెప్పలేదు’’ అని విజయ్ తెలిపారు. తాను కథానాయకుడిగా తెరకెక్కిన ‘లైగర్’ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ఇటీవల దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11గంటలపాటు ఈడీ అధికారులు విజయ్‌పై పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారు. దుబాయికి డబ్బులు పంపించి, అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ‘లైగర్’లో భాగస్వాములైన వారిని అధికారులు విచారిస్తున్నారు.
నా పాపులారిటీ కారణంగా ఈడీ విచారించింది
Related tags :