NRI-NRT

సామినేని రవికి తెలంగాణా ప్రభుత్వ అవార్డు

సామినేని రవికి తెలంగాణా ప్రభుత్వ అవార్డు

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా దివ్యాంగులకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్న తానా ఫౌండేషన్ సహకారానికి గుర్తింపుగా ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవాసుడు, తానా ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవిని ప్రభుత్వం పురస్కారాంతో సత్కరించింది. గత కొన్ని సంవత్సరాలుగా తానా ఆదరణ కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలను దాతల సహాయంతో ట్రై సైకిల్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్, మూడు చక్రాల మోటారు వాహనాలను, వీల్ ఛైర్స్, లాప్‌టాప్‌లను అవసరమైన వారికి అందించినందుకు ఆయనకు ఈ పురస్కారం అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తానా ఫౌండేషన్‌ను ఉత్తమ NGOగా గుర్తించింది. రవి సామినేని మాట్లాడుతూ మాతృదేశం మీద మమకారంతో అమెరికాలో స్థిరపడిన తెలుగువారు అనేక సేవా కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను వితరణగా అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తానా సేవలను తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ దివ్య దేవరాజా తదితరులు పాల్గొన్నారు.
TS Govt Awards To TANA Foundation. Ravi Samineni Awarded.