DailyDose

ఊళ్ళో ఈగల మోత.. వివాహాలకు మోగని బాజా

ఊళ్ళో ఈగల మోత.. వివాహాలకు మోగని బాజా

ఆ ఊళ్లల్లో ఎక్కడ చూసినా ఈగల మోతే.. వాటి బాధకు కోడళ్లు పుట్టింటి బాట పడుతుంటే.. బ్రహ్మచారులకు పెళ్లిళ్లు కాక ముదిరిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ హర్డోయ్ జిల్లాలో అహిరోరి బ్లాక్లో పది గ్రామాలు ఉన్నాయి. వాటి సమీపంలో 2014లో ఓ కోళ్ల ఫారం నిర్మించారు. అప్పటి నుంచి కాలుష్యం విపరీతంగా పెరిగి తమ గ్రామాల్లోకి ఈగలు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. వాటి రొదతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా పొలోమంటూ మూగుతూ తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. వీటి బాధపడలేక చాలా మంది మహిళలు ఇళ్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోయారు. ఆయా గ్రామాల పరిధిలో చాలా మందికి పెళ్లీడు వచ్చినా, ఈగల కారణంగా వారెవ్వరికి వివాహాలు కావట్లేదు.