Movies

వారణాసి మహిళగా..అమలాపాల్‌

వారణాసి మహిళగా..అమలాపాల్‌

తమిళ తార అమలాపాల్‌ బాలీవుడ్‌ అరంగేట్రం చేస్తున్నది. అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటిస్తున్న ‘భోలా’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నది. వారణాసిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో చేరింది అమలా పాల్‌. ఈ చిత్రంలో ఆమె వారణాసి మహిళ పాత్రలో కనిపించనుంది. ఈ క్యారెక్టర్‌ వివరాలు వెల్లడించేందుకు చిత్రబృందం ఇష్టపడటం లేదు. ఇక్కడ వారం పాటు షూటింగ్‌ చేయబోతున్నారు. టబూ మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నది.
కార్తి హీరోగా కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘ఖైదీ’ సినిమాకు హిందీ రీమేక్‌ ఈ సినిమా. అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అమలా గతంలో హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ‘రంజిష్‌ హై సహీ’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ఆమెను తొలిసారి ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక భోలాతో ఆమె హిందీలో కెరీర్‌ నిర్మించుకునే పనిలో పడింది.