బత్తినేని ప్రకాష్ సారధ్యంలో ఖమ్మంలో వైభవంగా తానా సాంస్కృతిక సంబరాలు..
తానా ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలో బత్తినేని ప్రకాష్ సారధ్యంలో ఆదివారం నాడు మమతా మెడికల్ కళాశాల ఆవరణలో భారీ స్థాయిలో 250 మంది కళాకారుల ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు మంత్రి మాట్లాడుతూ తానా చేస్తున్న సేవలను ప్రశంసించారు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ఈ డిసెంబర్ నెలలో మిలియన్ డాలర్ల ఖర్చుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వైద్య ఆరోగ్య శిబిరాలు రైతులకు ఉచితంగా పరికరాలు క్యాన్సర్ క్యాంపులు ఉపకార వేతనాల పంపిణీ నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు
audi tt rs wallpaper
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి సినీ నేపధ్య గాయకుడు సింహ సింధూరి సంగీత విభావరితో అలరించారు భద్రాచలానికి చెందిన బధిర పాఠశాల విద్యార్థులు చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు కొమ్ము కొయ్య నృత్యాలు రాజన్న డోలు ఒగ్గు కథ యక్షగానం బుర్రకథ ఏకపాత్రాభినయాలు డప్పుల దరువు కోలాటం తదితర ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ పువ్వాడ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించారు తానా ప్రతినిధులు మందడపు రవి సునీల్ పంత్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె సాంబశివరావు ఖమ్మం మేయర్ నీరజా బత్తినేని ట్రస్ట్ అధినేత బత్తినేని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఉదయం క్యాన్సర్ క్యాంపు తో పాటు వివిధ రకాల ఆరోగ్య శిబిరాలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు