తెలుగు దేశం పార్టీ వినూత్నంగా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ఇప్పుడు క్రమేణా గల్ఫ్ దేశాలలో కూడ విస్తరిస్తుంది. పార్టీ అభిమానులు తమకు తోచిన విధంగా స్ధానిక నిబంధనలను అనుసరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో ప్రవాసీయులు నివసిస్తున్న దృష్ట్యా తెలుగు దేశం పార్టీ సౌదీ అరేబియా ఎన్నారై శాఖ ఇటీవల సాయంత్రం ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించగా చలిను సైతం లెక్క చేయకుండా పార్టీ అభిమానులు పాల్గోన్నారు.
వడ్లమూడి సారధి నాయుడు అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరయ్య, రమేశ్, చలపతి రావు, సుదర్శన్, దేవరాజు, ప్రసాద్, చక్రపాణి తదితరులు పాల్గోన్నారు.