Politics

దలైలామా పర్యటన సందర్భంగా.. రెండు లక్షల రొట్టెలు.. 75 వేల టీ.

దలైలామా పర్యటన సందర్భంగా.. రెండు లక్షల రొట్టెలు.. 75 వేల టీ.

దలైలామా ఉపన్యాసానికి భారీ ఏర్పాట్లు.. రోజుకు 2 లక్షల రొట్టెలు, 75 వేల లీటర్ల టీ
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం బుద్ధగయలో బౌద్ధ మతగురువు దలైలామా ఉపన్యసించనున్నారు. ఈ ఉపన్యాసాలు వినడానికి వచ్చిన భక్తులకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి టీ,రొట్టెలు అందించడానికి వేల లీటర్ల సామర్థ్యం ఉండే పాత్రలను తీసుకువచ్చారు.
ప్రముఖ టిబెటియన్​ ఆధ్యాత్మిక గురువు దలైలామా బిహార్​లోని బుద్ధగయలో ఉపన్యసించనున్నారు. దీనికోసం అక్కడి బౌద్ధ ఆలయంలోని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలనుంచి దాదాపు 50,000 మంది బౌద్ధ సన్యాసులు రానున్నారు. ఆ భక్తులకు టీ, రొట్టెలు అందించడానికి ఇప్పటికే పెద్ద పాత్రలను సిద్ధం చేశారు. డిసెంబర్​ 29, 30, 31వ తేదీల్లో బుద్ధగయ ఆలయంలో మతగురువు దలైలామా మాట్లాడనున్నారు.
ఈ ఉపన్యాసాలు వినడానికి వచ్చిన భక్తులకు టీ అందించడానికి.. 30 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండే మూడు పెద్ద పాత్రలను తీసుకువచ్చారు. వీటిలో రోజుకు 75,000 లీటర్ల ఛాయ్​ను తయారుచేస్తారు. టీని అందించడం కోసం ఏకంగా 2,000 కెటిల్​లు తీసుకువచ్చారు. దీంతో పాటుగా రోజుకు 2 లక్షల రొట్టెలను తయారు చేయనున్నారు. వీటిని వండడానికి పెద్ద వంటగదిని కూడా ఏర్పాటు చేశారు. ఈ వంటకాలను తయారు చేయడం కోసం గయ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనేక వందల మంది వంట మనుషులు రానున్నారు. ఈ మహా కడాయిల్లో ఒకేసారి ఏకంగా 30 వేల మందికి సరిపడా టీ తయారవుతుంది.
కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు టీ, రొట్టెలను తీసుకొంటారు. అయితే భక్తులకు రెండు రకాలు టీలను అందించనున్నారు. టిబెట్​లో దొరికే వెన్న, నెయ్యి, చక్కెరని ఉపయోగించి సాల్ట్​ టీని తయారుచేస్తారు. దీనిలో తక్కువ టీ పొడిని వినియోగిస్తారు. ఈ వంటల ప్రక్రియ మూడు రోజులు పాటు కొనసాగనుంది. బౌద్ధ సన్యాసులు గయ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి హోటళ్లలో వీటికి విపరీతంగా డిమాండ్​ ఉంటుంది.