గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీలో చనిపోయినవారి ఒక్కొక్క కుటుంబానికి 3,00,000 (3 లక్షల రూపాయలు) ఆర్ధిక సహాయం ప్రకటించిన మన్నవ మోహనకృష్ణ
నిన్న గుంటూరు లోని వికాస్ నగర్లో జనతా వస్త్రాలు పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయినవారికి ఒక్కొక్క కుటుంబానికి *3,00,000 (3 లక్షల రూపాయలు) ఆర్ధిక సహాయం ప్రకటించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ. అలాగే క్షతగాత్రులైనవారికి మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అని విధాలుగా అండగా ఉంటానని మన్నవ మోహనకృష్ణ పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి పవిత్ర ఆత్మలు శాంతించాలని మన్నవ మోహనకృష్ణ ప్రార్ధించారు.