సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం’ సంక్రాంతి సంబరాల సన్నహాలు అప్పుడె మోదలయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రెండు రోజుల సంక్రాంతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు అద్యంతం కోలాహలంగా కొనసాగాయి.
ఎడారి నాట ఘల్లు ఘల్లుమని కురుస్తున్న జల్లు వర్షంలో బ్యాటింగ్ తడిసిన బుతువులో మంటలను రాజేస్తుండగా ఉరిమే ఉత్సాహాంతో ఔత్సిహిక తెలుగు యువ క్రీడాకారులు తమ అభిమాన ఆటను ఆడి ఆదరగొట్టారు. తెలుగు క్రీడాకారుల అధ్భుత క్రికెట్ తీరును చూసి అటుగా వెళ్తున్న ఇద్దరు ఆంగ్లేయులు కూడ వచ్చి సరదాగా కాసేపు క్రికెట్ ఆడటమె కాకుండ సంక్రాంతి ఉత్సవాలకు కూడ తాము హాజరవుతామని తమ ఆసక్తిను వెల్లడించారు.
మహెంద్ర వాకాటి నేతృత్వంలోని రియాధ్ సూపర్ కింగ్స్, ఆర్.వి.పి. ప్రసాద్ నాయకత్వంలోని సంక్రాంతి సన్ రైజర్స్, హేమంత్ కెప్టెన్సీలోని తెలుగు టైటాన్ ఫెటర్స్ మరియు ఇబ్రహీం శేఖ్ నాయకత్వంలోని తెలుగు టైటాన్ రైడర్స్ జట్లు శుక్రవారం ఉత్కంఠ భరితంగా పోటీపడగా అందులో తెలుగు టైటాన్స్ ఫెటర్స్ మరియు తెలుగు టైటాన్ రైడర్స్ జట్లు ఫైనల్స్ కు చేరుకోన్నాయి. ఇక శనివారం అనేక మంది ఆంధ్ర కుటుంబాల సమక్షంలో ప్రొద్దు నుండి రాత్రి వరకు ఆసక్తికరంగా కొనసాగిన హోరహోరి పోరులో తెలుగు టైటాన్ ఫైటర్స్ అంతిమ విజేతగా నిలిచింది. విజేతలలో హేమంత్, వినోద్ కుమార్, అమర్ ములసని, వెంకట్ గుగ్గిలం, సిద్దీఖ్ శేఖ్, చరణ్ కుమార్, భాస్కర్ గుండవల్లి, సందీప్ మాశెట్టి, శ్రీకాంత్, అనిల్ కుమార్ మర్రి మరియు సురేష్ కుమార్ ముదావత్లు ఉన్నారు.
ఈ క్రీడోత్సవానికి సుఖేశ్ గుత్తు, స్వామి, బిందు భాస్కర్, నరేంద్ర పెళ్ళూరు లు తోడ్పాటందించగా క్రీడాకారులకు నాగేంద్ర, ఇబ్రహీం శేఖ్, శేషు బాబు భోజన ఏర్పాట్లను సమకూర్చారు.
విజేతలకు వచ్చె వారం, జనవరి 13న రియాధ్ నగరంలో ఘనంగా నిర్వహించబడె సంక్రాంతి సంబురాలలో బహుమతి ప్రధానం జరుగుతుందని సమ్మేళనం కన్వీనర్ స్వామి సవర్ణ తెలిపారు.
రియాధ్ నగరంలో గత అయిదెళ్ళుగా రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంస్ధ సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తుందని, అందులో భాగంగా వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను తాము నిర్వహిస్తామని స్వామి వెల్లడించారు.
రియాధ్ నగరంలో నివసించె తెలుగు కుటుంబాలన్ని కూడ ఇందులో పాల్గోనవచ్చని, మరిన్ని వివరాల కొరకు 0564994408 నెంబర్ పై సంప్రదించవచ్చని కూడ స్వామి పెర్కోన్నారు.